ట్విట్టర్ సాక్షిగా కేటీఆర్ చేతిలో బుక్కయిపోయిన బాబు
తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అపద్ధర్మ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ దూకుడుతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విరుచుకుపడుతున్న టీఆర్ ఎస్ నేతలు అందివచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టీఆర్ ఎస్ పార్టీ యువనేత - మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా పచ్చపార్టీ అధినేత తీరును - కాంగ్రెస్ తో ఆయన పొత్తుపెట్టుకుంటున్న విధానాన్ని ఎండగట్టారు.
కాంగ్రెస్ ను ఉద్దేశించి గతంలో బాబు చేసిన ట్వీట్లను తాజాగా కేటీఆర్ పోస్ట్ చేస్తూ విరుచుకపడ్డారు. అవినీతి కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని గతంలో చంద్రబాబు చేసిన ట్వీట్లను కేటీఆర్ గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ పార్టీని ఇటాలియన్ మాఫియా రాజ్‌తో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడదే ఇటాలియన్ మాఫియా రాజ్ తో ఎలా జతకట్టారని ప్రశ్నించారు. అందుకే అది మహాకూటమి కాదు.. మహాఘటియా బంధన్ అని కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించడం వల్లే 2004లో కాంగ్రెస్‌తో.. 2009లో టీడీపీతో టీఆర్ ఎస్ పొత్తుపెట్టుకుందని వివరించారు. టీడీపీ-కాంగ్రెస్ మాత్రం అవకాశవాదం.. అధికార దాహంతోనే ఒక్కటయ్యాయని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్‌తో పొత్తును కవర్ చేసుకునేందుకు చంద్రబాబు ఎన్ని పాట్లు పడుతున్నా...అన్ని రకాలుగా బుక్ అయిపోతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.