• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ ప‌నితీరుకు ఇదో...

కేసీఆర్ ప‌నితీరుకు ఇదో నిద‌ర్శ‌నం

By - Tupaki Desk
Update: 2016-08-31 06:12 GMT
సీఎన్‌ బీసీ బిజినెస్ టీవీ చానెల్ ప్రతిఏటా ఇచ్చే లీడర్ అవార్డుల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుకు ఎంపికైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేతుల మీదుగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఈ ఆవార్డును ఢిల్లీలో అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ త‌న తండ్రి - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను పొగిడేశారు. సీఎం కేసీఆర్ పరిపాలనకు ఢిల్లీ వేదికగా దక్కిన గౌరవమని చెప్పారు.

అవార్డును అందుకున్న అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ - మోస్ట్ ప్రామిసింగ్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు అందుకోవడం మాత్రమే కాకుండా ఆ ప్రామిస్‌ లను అమలుచేసి గుర్తింపు సంపాదిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా చ‌మ‌త్క‌రించారు.  కొత్తరాష్ట్రమే అయినా అనేక రాష్ట్రాల‌తో పోటీపడి అవార్డు అందుకోవడం సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు - పనితీరుకు నిదర్శనమని మంత్రి చెప్పారు. దేశంలోనే త్వరలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌ గా ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  కొత్తగా ఏర్పడిన, అతి తక్కువ వయసు కలిగిన రాష్ట్రమే అయినప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తున్నదనడానికి - అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నదనడానికి ఈ అవార్డు నిదర్శనమని కేటీఆర్‌ చెప్పారు. ప్రజలకు అభివృద్ధి - సంక్షేమ ఫలాలను అందించడానికి సంక్షేమం - సాగునీరు - పరిశ్రమలు.. ఇలా పలురంగాల్లో నూతన పాలసీలు వచ్చాయని, ఇవే తెలంగాణ పురోగామి రాష్ట్రంగా తయారు కావడానికి దోహదం చేశాయని కేటీఆర్ చెప్పారు.
Tags:    
  • KTR 
  • Most Promising State Of The Year Award 
  • Arun Jaitley 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS