మీడియా అంటే.. కేటీఆర్ భయపడుతున్నారా?
ప్రధానితో భేటీకి అవకాశం లభించిందంటే.. సదరు భేటీలో ఏమేం అంశాలు ప్రస్తావించాలన్న విషయంపై చాలా పెద్ద సకరత్తే జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక... దేశంలో చాలా రాష్ట్రాల సీఎంలకు కూడా పీఎం అపాయింట్ మెంట్ లభించడం లేదు. ఇందుకు నిదర్శనంగా టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ - టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడులకు పీఎంఓ నుంచి లభించిన ఛీత్కారాలే నిలుస్తున్నాయని చెప్పాలి. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో నేత అపాయింట్ మెంట్ అడిగితే... గతంలో ఏ ప్రధాని కూడా తిరస్కరించిన దాఖలా లేదనే చెప్పాలి. అయితే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయనే చెప్పక తప్పదు. ప్రధానిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లి అక్కడే నాలుగు రోజులు ఉన్నా కూడా కేసీఆర్‌కు అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో ప్రధానిని కలవకుండానే కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక చంద్రబాబు విషయంలో ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్కే లేదు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ కుమారుడు - తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కల్వకుంట్ల తారకరామారావుకు ప్రధాని అపాయింట్ లభించింది. ఇద్దరు చంద్రుళ్లకు అపాయింట్ మెంట్ నిరాకరిస్తూ వస్తున్న మోదీ... కేటీఆర్ అడగ్గానే అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకున్నదని చెప్పక తప్పదు. పీఎంఓ నుంచి అపాయింట్ మెంట్ ఖరారు చేసుకున్న కేటీఆర్... పీఎంఓ నిర్దేశించిన సమయానికి మోదీతో భేటీ కోసం కేటీఆర్ సమాయత్తం అవుతున్నారు. సాధారణంగా ఏ నేత అయినా.... ముఖ్యులతో భేటీ తర్వాత గానీ... సదరు భేటీలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయాన్ని చెప్పరు. కొన్ని సందర్భాల్లో ముందుగానే విషయాలను వెల్లడించేసి బయలుదేరే నేతలు కూడా లేకపోలేదు. ఈ రెండో రకానికి చెందిన నేతగా ఇప్పుడు కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. తాను ప్రధానితో భేటీ కానున్నానని, సదరు భేటీలో తాను పీఎంతో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ - హైదరాబాదు పరిధిలో కొత్తగా ఏర్పాటు కానున్న ఐటీఐఆర్ చర్చించనున్నట్లు తన ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. అయినా ఏ ఒక్కరు అడగకుండానే కేటీఆర్ ఈ విషయాలను వెల్లడి చేయడం వెనుక ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.
ఎందుకంటే... ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ - కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నానని ఓ వైపు తండ్రి కేసీఆర్ చెబుతూ ఉంటే... ఇంకో వైపు కేటీఆర్ కిమ్మనకుండా ప్రధానితో భేటీకి ఎలా వెళతారన్న కోణంలో పుకార్లు షికారు చేసే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఇప్పుడున్న స్పీడులో మీడియా ఈ భేటీపై పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసేస్తే... పరిస్థితి ఏమిటి?... మొత్తం రచ్చ జరిగిన తర్వాత వివరాలు వెల్లడించడం ఎందుకు? ముందే ఆ వివరాలు వెల్లడిస్తే సరిపోతుంది కదా? అన్న కోణంలో ఆలోచించిన కేటీఆర్ ఈ వివరాలు వెల్లడించినట్లుగా ఇప్పుడు కొత్తగా కథనాలు వినిపిస్తున్నాయి. అయినా మోదీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్... మీడియాకు ఇంతలా భయపడతారా? అంటే... తప్పదు మరి. అసలే కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి మరి. ఇప్పటికే ఎన్నికల ఫీవర్ అంతటా వ్యాపించేసింది. ఇలాంటి కీలక తరుణంలో ప్రధానితో తన భేటీ ఏ విపరిణామాలకు దారి తీయరాదన్న భావనతోనే కేటీఆర్ మీడియాలో తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రాకూడదన్న భావనతోనే ఈ తరహాలో వ్యవహరించి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ప్రధానితో భేటీకి అపాయింట్ మెంట్ దక్కించుకున్న కేటీఆర్... ఆ భేటీ కంటే చాలా ముందుగానే ఈ విషయంపై పెద్ద చర్చకే తెర తీసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.