పిక్ టాక్: కవితపై కేటీఆర్ ఆప్యాయత!

Update: 2022-04-27 13:08 GMT
కేసీఆర్, కేటీఆర్ ను సన్నిహితంగా చాలా సార్లు చూశాం. విజయాలు దక్కినప్పుడు ఈ తండ్రీ కొడుకులు ఆప్యాయంగా పలకరించుకుంటారు.కానీ కేటీఆర్, కవిత మాత్రం తరుచుగానే కనిపిస్తారు. ఏదో రాకీ పండుగకు తప్పితే వాళ్లు మళ్లీ కలిసి కనిపించరు. కానీ టీఆర్ఎస్ ప్లీనరీ సాక్షిగా వీరిద్దరి మధ్య ఆప్యాయత మరోసారి బయటపడింది.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని కే చంద్రశేఖర్ రావు   స్థాపించి 21 ఏళ్లు పూర్తయ్యాయి. 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని  ఇవ్వడంతో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ లక్ష్యం నెరవేరింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడంతో తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ ఖ్యాతిగడించారు. రెండోసారి సైతం గెలిచి తెలంగాణను అభివృద్ధి బాటలో పయనింపచేస్తున్నారు.

బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో పార్టీ 21వ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితా  ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఈ తోబుట్టువులు ఆప్యాయతను చాటుకున్నారు.

ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ కవిత ఎమోషనల్ అయ్యారు.  'టీఆర్ఎస్ ప్లీనరీలో రామన్న (కేటీఆర్)తో కలిసిన నేను'అని కవిత వ్యాఖ్యానించారు. దీన్ని టీఆర్‌ఎస్‌ వర్గీయులు, కవిత అనుచరులు చూసి లైక్‌లు కురిపిస్తున్నారు. ఈ అన్నాచెల్లెల్ల ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇక  కవితకు భారీ ప్రమోషన్ వచ్చింది. జాతీయ రాజకీయాలపై పనిచేసే కమిటీని కేసీఆర్ ప్రకటించారు. ఈ కమిటీకి కవిత తప్ప మరెవరూ నాయకత్వం వహించడానికి లేకుండా పోయారు. దీంతో ఆమెకే జాతీయ కమిటీ బాధ్యతలను కేసీఆర్ ఇచ్చారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఇది కవితపై పెద్ద బాధ్యతగా చెప్పొచ్చు.

కవిత జాతీయ రాజకీయాల్లో రాణిస్తుందా? కేసీఆర్‌కు న్యూఢిల్లీపై పెద్ద ఆశయాలు ఉన్నాయి. అయితే ఆమె వాటిని ఎంతవరకు కవతి నిర్వహిస్తుంది అనేది వేచిచూడాలి.
Tags:    

Similar News