• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాయావతితో పొత్తు...

మాయావతితో పొత్తు పెట్టుకోవడం 100% తప్పు: కోన

By - Tupaki Desk
Update: 2019-05-22 11:56 GMT
పాపులర్ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ఎలెక్షన్ క్యాంపెయిన్ జరుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం.. అవి వివాదాస్పదం కావడం తెలిసిందే.  పవన్ కు సన్నిహితుడిగా మెలిగిన కోన వెంకట్ ఇలా పవన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు ఏమాత్రం మింగుడుపడలేదు.  దీంతో కోనపై విమర్శలవర్షం కురిపించారు. దీంతో అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కోన వివరణ ఇచ్చారు కానీ ఇంకా ఫ్యాన్స్ కోపం అయితే చల్లారలేదు.  

ఎలెక్షన్స్ లో కోన వైసిపీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే తాజాగా కోన వెంకట్ ఒక వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. పవన్.. జనసేన టాపిక్ కూడా వచ్చింది.  ఆ టాపిక్ లపై మాట్లాడుతూ కొన్ని వ్యాఖలు చేశారు. "మీరు పవన్ కు సన్నిహితులు.. మీ సినిమా ఈవెంట్లకు పవన్ గారు హాజరయ్యారు. ఆలాంటప్పుడు మీరెందుకు పవన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు?" అని అడిగితే  "ఫ్రెండ్ షిప్ వేరు.. వారికుండే పర్సనల్.. పొలిటికల్ ఒపీనియన్స్ వేరు అయి ఉండొచ్చు.  నా ఆహారపు అలవాట్లు.. నా రాజకీయ అభిప్రాయాలు..నా వ్యక్తిగత ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం లేదు" అన్నారు.

ఇక జనసేన పార్టీ గురించి ప్రస్తావిస్తే పవన్ రెండు పొరపాట్లు చేశారని అభిప్రాయపడ్డాడు కోన. "ఒకటి పవన్ కళ్యాణ్ మాయావతి గారితో పొత్తు పెట్టుకోవడం. బీఎస్పీ కి ఆంధ్రప్రదేశ్ లో ఏమాత్రం బలం లేదు" అన్నారు.  "మాయావతి తో పొత్తు పెట్టుకోవడం మీరు తప్పుగా చూస్తున్నారా?" అని ప్రశ్నిస్తే.."100% తప్పు. అవినీతి ఆరోపణలు ఉంటేనే మీరు తప్పుగా చూస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలు నిరూపించబడి.. సుప్రీమ్ కోర్టు శిక్ష పడిన మాయావతి మీకు మదర్ థెరీసా లాగా కనిపించిందా?" అన్నారు.  ఇక రెండో విషయం గురించి మాట్లాడుతూ "హైదరాబాద్ లో ఆంధ్ర సెట్లర్లపై దాడులు జరుగుతున్నాయి అని పవన్ గారు విమర్శలు చేయడం కూడా సరి కాదు." అని చెప్పారు.  

అయితే అంతా విమర్శలు మాత్రమే కాదు.. పవన్ గురించి.. జనసేన గురించి చెప్తూ "డబ్బు ప్రభావం.. మందు ప్రభావం లేకుండా.. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ను తీసుకొచ్చే విప్లవం అది. సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కానీ అలాంటి రాజకీయానికి శ్రీకారం చుట్టినవారిలో పవన్ మొదటివాడు అవుతారు. నేను ఆ విషయంలో నా ఫ్రెండ్ ను చూసి గర్విస్తున్నాను" అన్నారు.  

కోన అయితే తన స్టైల్లో కామెంట్లు చేశారు. ఇక ఈ కామెంట్లపై పవన్ ఫ్యాన్స్.. మద్దతుదారులు ఎలా స్పందిస్తారోవేచి చూడాలి.
Tags:    
  • Kona Venkat 
  • Pawan Kalyan 
  • janasena party 
  • 2019 Elections 
  • latest updates 

Similar News

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS