నెలక్రితమే కోడెల ఆత్మహత్యయత్నం.. దాచేశారు.!

Update: 2019-09-17 05:41 GMT
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు టీడీపీ సీనియర్ నేత - మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు. ఆయన ‘కేట్యాక్స్ ’ బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాలు చేయడంతో కోడెలతోపాటు ఆయన కుమార్తె - కొడుకులపై కూడా కేసులు నమోదయ్యాయి. అప్పుడే కోడెల తీవ్రంగా కలతచెందారట..

ఆ తర్వాత అసెంబ్లీ ఫర్నిచర్ ను కోడెల సొంతానికి వాడుకున్నాడని.. దాన్ని వైసీపీ ప్రభుత్వం రికవరీ చేయడంతో మరింత కృంగిపోయాడు. ఈ వివాదంతో ఎంతో అవమాన పడ్డ కోడెల గత నెల ఆగస్టు 23న గుంటూరులోని కుమార్తె ఇంట్లోనే తొలిసారి ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. ఆరోజు రాత్రి 7 గంటలకు 30 నిద్రమాత్రలు మింగి సూసైడ్ అంటెప్ట్ చేశాడు.

అయితే ఆయన అల్లుడు - డాక్టర్ అయిన మనోహర్ వెంటనే గుర్తించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. నాడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు దాచిపెట్టి గుండెపోటు వచ్చిందని మీడియాకు చెప్పారు. నిజానికి ఆయన నెలకిందటే ఆత్మహత్యకు ప్రయత్నించాడని తాజాగా వెలుగుచూసింది.
   

Tags:    

Similar News