చికెన్ కొరతతో కేఎఫ్‌ సీ రెస్టారెంట్ల మూసివేత

Update: 2018-02-20 23:30 GMT
కేఎఫ్‌సీ రెస్టారెంట్ల గురించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. నోరూరించే చికెన్‌కు కేఎఫ్‌సీ మారుపేరు. అయితే చికెన్ కొరతతో కేఎప్‌సీ రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. మ‌నద‌గ్గ‌ర కాదులేండి. మ‌నోళ్లు ఎక్కువ‌గా ఉండే  బ్రిటన్‌లో. బ్రిటన్ లో ఉన్న 900 రెస్టారెంట్లలో 400 కు పైగా కేఎఫ్ సీ రెస్టారెంట్లను ఇప్పటికే మూసివేసినట్లు సంస్థ ప్రకటించింది. చికెన్ దొరకకపోవడంతోనే అవుట్ లెట్ లు మూపివేస్తున్నట్లు ప్రకటించింది.

చికెన్ రవాణా పాత కాంట్రాక్ట్ ను రద్దు చేసి మంగళవారం(ఫిబ్రవరి13)న DHL ట్రాన్స్ పోర్ట్ సంస్ధకు కేఎఫ్ సీ చికెన్ రవాణా బాధ్యతలను అప్పగించింది. అయితే అప్పటి నుండి చికెన్ సరఫరాలో సమస్యలు వచ్చాయట‌. దేశవ్యాప్తంగా ఫ్రెష్ చికెన్ తీసుకురావడం సమస్యగా ఉందని, నాణ్యత విషయంలో తాము రాజీ పడమని కేఎఫ్‌ సీ ట్వీట్ చేసింది. కేఎఫ్‌ సీలో పని చేస్తున్న ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చని కేఎఫ్‌సీ తెలిపింది.

Tags:    

Similar News