• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరో భారీ వరాన్ని ఇచ్చేసిన...

మరో భారీ వరాన్ని ఇచ్చేసిన కేసీఆర్

By - Tupaki Desk
Update: 2017-03-02 05:26 GMT
ఎన్నికల ముందు వరాలు ప్రకటించటం అందరి స్టైల్. కానీ.. అందుకు భిన్నంగా.. ఎలాంటి కారణం లేకుండానే వరుస పెట్టి వరాలు ఇచ్చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారంగా చెప్పాలి. ఇటీవల కాలంలో.. వివిధ వర్గాల వారిని తనఅధికార నివాసానికి పిలిపించుకొని వారితో చర్చల మీద చర్చలు.. జరిపి ఊహించని రీతిలో వరాలు ఇచ్చేస్తున్న సీఎం కేసీఆర్.. తాజాగా మరో భారీ వరాన్ని ప్రకటించేశారు.

చిరు ఉద్యోగులు తమ కలలో కూడా ఊహించని రీతిలో భారీగా వేతనాల్ని పెంచేయటం ద్వారా.. వేలాది మంది మనసుల్ని ఒక్క నిర్ణయంతో దోచేసుకున్నారని చెప్పాలి. ఇప్పటికే పలు వరాల్ని ప్రకటించిన కేసీఆర్.. తాజాగా గ్రామీణ సంస్థ సహాయకులు.. అదేనండి వీవోఏల వేతనాల్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత తక్కువ వేతనానికి విధులు నిర్వర్తించే ఉద్యోగులకు భారీగా పెంచేసిన వైనం ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది.

వీవోఏలకు ప్రస్తుతం రూ.500 నుంచి రూ.1500 మాత్రమే వేతనం లభిస్తోంది. ఇంత తక్కువ వేతనంతో విధులు నిర్వర్తించటంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అవుతూ.. వారి వేతనాల్ని ఒక్కసారిగా రూ.3500 పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పేశారు. కేసీఆర్ తాజా వరంతో వీవోఏల వేతనం ఏకంగా రూ.5వేలకు చేరుకోనుంది. అయితే.. ఈ పెంచిన వేతనంలో గ్రమైక్య సంఘాల ద్వారా రూ.2వేలు.. రాష్ట్ర సర్కారు రూ.3వేలు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏన్నో ఏళ్లుగా తమ వేతనం గురించి మొత్తుకున్నా.. ఎవరూ తమను పట్టించుకోలేదని చెబుతున్న వీవోఏలు..  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంపై ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోతున్నారు.

తాజాగా ప్రకటించిన వరంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీవోఏలుగా పని చేస్తున్న 18405 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఒక్క నిర్ణయంతో దాదాపు 19వేల కుటుంబాల్ని ఆనందంతో నింపేసిన కేసీఆర్ నిర్ణయం.. వారి అభిమానాన్ని ఎంతలా కొల్లగొడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదేమో. మరి.. భారీగా పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయంపై రాష్ట్ర సర్కారుపై ఎంత మేర అదనంగా భారం పడనుందన్న లెక్క విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • KCR 
  • Salaries 
  • Village Org Assistants 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS