'కేన్‌ అనే నేను' సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ కోసం..!

Update: 2021-03-25 03:30 GMT
ఐపీఎల్‌ 2021 ఆరంభంకు అంతా సిద్దం అయ్యింది. వచ్చే నెల 9 నుండి ఐపీఎల్ కొత్త సీజన్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రాంచైజీలు తమ తమ జట్లను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాయి. సోషల్‌ మీడియాలో ప్రతి జట్టు కూడా వారి జట్లకు సంబంధించిన ఆటగాళ్లను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ జట్టు వారు తెలుగులో పోస్ట్‌ లు పెట్టడంతో పాటు తెలుగు సినిమాల మీమ్స్ ను క్రియేట్‌ చేసి తెలుగు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా భరత్‌ అనే నేను పోస్టర్‌ ను ఉపయోగించి కెప్టెన్‌ కేన్ విలియమ్స్‌ పై మీమ్‌ చేశారు.

భరత్‌ అనే నేను పోస్టర్ లో మహేష్ బాబు ఫొటోను మార్ఫింగ్‌ చేశారు. మహేష్‌ బాబు బాడీకి కేన్‌ ఫేస్‌ ను పెట్టారు. ఆ ఫొటోపై కేన్‌ అనే నేను.. నా కర్తవ్యాన్ని శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానంటూ ప్రమాణం చేస్తున్నాను అంటూ కామెంట్‌ పెట్టారు. ఆ మీమ్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈసారి ఐపీఎల్‌ లో హైదరబాద్‌ జట్టు ఫైనల్‌ వరకు వెళ్తుందనే నమ్మకంను క్రీడా పండితులు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌ తో మరో రెండు నెలల పాటు క్రీడా అభిమానులకు పండగే పండగ.
Tags:    

Similar News