• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికా నుంచి పాల్ వీడియో...

అమెరికా నుంచి పాల్ వీడియో కాల్..వైర‌ల్!

By - Tupaki Desk
Update: 2018-01-24 16:37 GMT
కిలారి ఆనంద్ పాల్.....షార్ట్ క‌ట్ లో కే ఏ పాల్.....భార‌త్ లో ఈ ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త ప్ర‌చార‌కుడి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. ఫ్లోరిడాలో తాను అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుటుంబ‌ స‌భ్యుల‌తో క‌లిసి ప్రార్థ‌న‌లు చేశాన‌ని - ప్లోరిడాలో ఆయ‌న విజ‌యం సాధించార‌ని పాల్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.  కొద్ది రోజుల నుంచి అమెరికాలో మ‌కాం వేసిన కేఏ పాల్  ఈ రోజు అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా హైద‌రాబాద్ లోని మీడియా మిత్రుల‌తో మాట్లాడారు. సోమాజీగూడ‌లోని ప్రెస్ క్ల‌బ్ లో మీడియా మిత్రుల‌తో మాట్లాడిన పాల్ అనేక షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికా - ఉత్త‌ర కొరియాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించేందుకు తాను ఇరు దేశాధినేత‌ల‌తో పాటు  - కీల‌క నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని - ఆ యుద్ధం జ‌ర‌గ‌కుండా ఆప‌డంలో తాను కీల‌క‌పాత్ర పోషించాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఫిబ్ర‌వ‌రి 10 తారీకున తాను హైద‌రాబాద్ - సికింద్ర‌బాద్ ల‌లో ప‌ర్య‌టించ‌బోతున్నాన‌ని తెలిపారు. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్ లో గ్లోబ‌ల్ పీస్ ర్యాలీ నిర్వ‌హించ‌బోతున్నాన‌ని చెప్పారు. ఈ ర్యాలీకి త‌న మిత్రులు - బంధువులు - మీడియా - అన్ని కుల మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు హాజ‌రు కావాల‌ని ఆయ‌న కోరారు. సిరియా - ఇరాన్  - మిడిల్ ఈస్ట్ ల‌లో జ‌రుగుతున్న అల్ల‌ర్ల నేప‌థ్యంలో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యార‌ని, వారంతా వేరే దేశాల‌కు వ‌ల‌స వెళ్లాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని చెప్పారు. భార‌తీయులు - హైద‌రాబాద్ వాసులు - ప్ర‌పంచ‌ శాంతిని కాంక్షించే ప్ర‌తి ఒక్క‌రూ ఆ ర్యాలీలో పాల్గొనాల‌ని పిలుపునిచ్చారు. కుల‌ - మ‌త‌ - జాతి భేదాలు విడ‌నాడి.....శాంతి స్థాప‌న కోసం చేప‌డుతున్న ర్యాలీని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. ప్ర‌పంచాన్ని మార్చ‌డానికి - మంచిని పెంపొందించ‌డానికి ఇదొక సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని పాల్ అన్నారు. స‌మ‌యాభావం వ‌ల్ల నేరుగా వ‌చ్చి ప్రెస్ మీట్ పెట్ట‌లేక‌పోతున్నాన‌ని - అందుకే మీడియా మిత్రులు స‌హ‌క‌రించి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌న్నారు.

ట్రంప్ - కిమ్ జాంగ్ ఉన్ ల మ‌ధ్య తానే స‌యోధ్య కుదిర్చాన‌ని పాల్ చెప్పిన మాట‌లు మీడియా మిత్రుల‌కు న‌వ్వు తెప్పించాయి. నిత్యం ఏదో ఒక విష‌యంతో వార్త‌ల్లో నిలవాల‌ని చూడ‌డం పాల్ కు అల‌వాటేన‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ మీడియా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. పాల్ చెప్పిన మాట‌లు ఫ‌న్నీగా ఉన్నాయ‌ని - కామెడీ షో లా ఉంద‌ని ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి - పాల్ పిలుపు ప్ర‌కారం ఎంత‌మంది ఆ ర్యాలీలో పాల్గొంటారో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌వ‌చ్చు.


Tags:    
  • K A Paul 
  • Video Call 
  • Media Global Peace Festival 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS