• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ - జగన్.. మధ్యలో...

పవన్ - జగన్.. మధ్యలో జనసేన ఎమ్మెల్యే

By - Tupaki Desk
Update: 2019-06-18 07:51 GMT
జనసేనాని పవన్ తీరు వేరు.. ఆయన బీజేపీ - టీడీపీ అనుకూల వాదేనని విమర్శలొచ్చాయి.. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో ఆ రెండు పార్టీల కూటమికి మద్దతిచ్చి వారిని అధికారంలోకి వచ్చేలా చేశారు. గెలుస్తుందనుకున్న వైసీపీని జనసేనతో దెబ్బకొట్టారు పవన్.  కానీ బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. టీడీపీ కూడా మాటకు కట్టుబడలేదని.. 2019 ఎన్నికల వేళ సొంతంగా జనసేనతో పోరాడారు. అయితే పవన్ గత ప్రచారం మొత్తం చూస్తే మనకు ఒకటే అర్థమవుతుంది. అదే యాంటీ వైసీపీ విధానం..

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చూసిన వారందరికీ ఒక్కటే అనిపించింది.. అధికార టీడీపీని వదిలి ప్రతిపక్ష వైసీపీని జనసేనాని టార్గెట్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. టీడీపీ-జనసేన తెరవెనుక బంధంపై అనుమానాలు కలిగాయి. వైఎస్ జగన్ పై పవన్ తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. జగన్ నీడనే గిట్టని విధంగా పవన్ వైఖరి తేటతెల్లమైంది.

కానీ 2019 ఎన్నికలు జనసేనాని పవన్ కు పీడకలను మిగిల్చాయి. ఆయన వ్యతిరేకించిన జగన్ నే జనాలు గెలిపించారు. జగన్ గెలిచారు.. సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తొలి అసెంబ్లీలోనే ప్రశంసలు అందుకున్నారు. అయితే అందరి నుంచి ప్రశంసలు రావడం ఒకెత్తు.. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక ప్రసాద్ వైఎస్ జగన్ పాలనపై - జగన్ పై ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రస్తావిస్తూ మరీ వీటిని అమలు చేయాలని కీర్తించడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరని.. అమ్మ ఒడి - రాజన్న బడి సహా ఎస్సీ - ఎస్టీ బీసీలకు ప్రాధాన్యమివ్వడంపై జనసేన ఎమ్మెల్యే ప్రశంసలు కురిపించారు.మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమన్నారు.

ఇక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. బీజేపీతో వైసీపీ స్నేహంగా ఉందని.. మిత్రపక్షం బీజేపీని ఒప్పించి హోదా సాధించాలని కోరడం రచ్చకు దారితీసింది..దీనిపై వైసీపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీడీపీతో జనసేన అంతర్గత పొత్తు పెట్టుకుందని.. బీజేపీతోనూ లాలూచీ పడిందని.. కానీ వైసీపీ ఏనాడు బీజేపీతో కలిసి పోటీచేయలేదని.. పొత్తు కూడా పెట్టుకోలేని సెటైర్ వేశారు.

ఇలా జనసేన ఎమ్మెల్యే జగన్ ను - వైసీపీ ప్రభుత్వాన్ని పొగడడం సంచలనంగా మారింది. జనసేనాని పవన్ వ్యతిరేకిస్తున్న జగన్ ను జనసేన ఎమ్మెల్యే కీర్తించడంతో ఈయన జనసేనను వీడుతారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక మొన్నీ మధ్యనే జగన్ ను కలిసి అభినందనలు తెలిపాడట.. చర్చలు జరిపాడట.. చూస్తుంటే ఉన్న ఒక్క జనసేన ఎమ్మెల్యే కూడా పవన్ కు షాకిచ్చేటట్టే ఉన్నాడు.

   

Tags:    
  • Janasena MLA 
  • Rapaka Varaprasad 
  • YCP 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS