• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జై జవాన్ .. 'వో హై...

జై జవాన్ .. 'వో హై గల్వాన్‌ కే వీర్‌' రియల్ హీరోస్ అంటున్న ఇండియన్ ఆర్మీ

By - Tupaki Desk
Update: 2021-06-16 07:30 GMT
ప్రాణాలు పోతాయని తెలిసినా భారత జవాన్లు , దేశం కోసం తమ ప్రాణాలని కూడా లెక్క చేయలేదు , కట్టు తప్పలేదు. నిబంధనలను వీడలేదు. చైనా సైనికులు మారణాయుధాలతో దాడికి దిగినా,  కొదమసింహాల్లా ఎదురు నిలిచారు. ఖాళీ చేతులతోనే శత్రువులను మట్టి కరిపించారు. వీరు 100 మంది. అవతలి వైపు 300ల మంది. అయినా ఏ మాత్రం భయం అనేది లేకుండా  శత్రు వర్గానికి రెట్టింపు నష్టం కలిగించారు. ఈ క్రమంలో 20 మంది జవాన్లు అమరులయ్యారు. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలు ఇవి. చైనా జవాన్లు ఇనుపచువ్వలు బిగించిన రాడ్లతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. భార‌త సైనికుల‌పై మెరుపు వేగంతో దాడి చేశారు. చైనా వెన్నుపోటు పొడిచినా.. భార‌త ఆర్మీ వెంటనే అప్రమత్తమైంది. జూలు విదిల్చిన సింహంలా విజృంభించింది. ఈ ఘర్షణలో కల్నల్‌ సంతోశ్‌కుమార్‌తో పాటు 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా వైపు యాభై మందికి పైగా చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది.

లద్ధాఖ్‌ లో గల్వాన్‌ లోయలో ఇండియా, చైనా ఆర్మీల మధ్య ఘర్షణ జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా ఇండియన్‌ ఆర్మీ వీడియో రిలీజ్‌ చేసింది. వో హై గల్వాన్‌ కే వీర్‌ పేరుతో ఇండియన్‌ ఆర్మీ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది. హరిహరన్‌, సోనూనిగమ్‌ లతో కూడిన గాయకుల బృందం ఈ పాటను ఆలపించగా , ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇండియన్‌ సైనికులు ఏ విధంగా గస్తీ కాస్తూ దేశ భద్రతను కాపాడుతున్నారనే విషయాల్ని వీడియోలో కళ్లకి కట్టినట్టు చూపించారు. చివరగా గల్వాన్‌  పోరాటంలో అమరులు ఈ వీడియోలో కనిపిస్తారు. 


#WATCH Indian Army releases a video on the first anniversary of the Galwan Valley clash in which 20 Indian soldiers were killed while fighting Chinese aggression pic.twitter.com/ykJhcXrgxg

— ANI (@ANI) June 15, 2021


Tags:    
  • Jai Jawan 
  • Wo Hai Galwan Ke Veer 
  • Indian Army 
  • Real Heroes 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS