• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లీకేజీ లెక్క‌లన్నీ...

లీకేజీ లెక్క‌లన్నీ చెప్పేసిన జ‌గ‌న్‌

By - Tupaki Desk
Update: 2017-03-30 11:40 GMT
ఏపీ మంత్రి నారాయ‌ణ‌కు చెందిన నెల్లూరులోని నారాయణ హైస్కూల్లో పదోతరగతి ప్రశ్నపత్రం లీక్ అవ‌డంపై మూడో రోజు సైతం ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌ధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆధారాల‌తో స‌హా వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో పద్ధతి ప్రకారం ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని  ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంత్రి నారాయణ తన కాలేజీల్లోని పిల్లలకు ర్యాంకుల కోసం పేపర్ లీకేజ్ లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మొదట టెన్త్ పేపర్ లీకేజే కాలేదని ప్రభుత్వం బుకాయించిందని, తాము డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నివేదక బయటపెట్టిన తర్వాత పేపర్ లీకయిందని ఒప్పుకున్నారని వైఎస్ జగన్ తెలిపారు.

లీకేజీపై అసెంబ్లీలో జరిగిన వాడివేడి చర్చలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీరును కడిగి పారేశారు. తొమ్మిదన్నరకు పరీక్ష ప్రారంభమైతే ఐదు నిమిషాల ముందే నారాయణ కాలేజ్ ఎంప్లాయ్  సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి నారాయణ కాలేజ్ కు సంబంధించిన స్టాప్స్ కు పంపించారని, వారు ఆన్సర్ రూపంలో దాన్ని చేరవేసి పరీక్షలు రాయిస్తావుంటే...ఇది మీకు అన్యాయంగా కనిపించడం లేదా, మోసంగా కనిపించడం లేదా అని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. నారాయణ కాలేజ్ కు సంబంధించిన ఉద్యోగి ఆ ప్రశ్నాపత్రాన్ని ఇంకా ఎవరెవరికి పంపించాడో సీబీఐ ఎంక్వైరీ వేస్తే మొత్తం బయటపడుతుంద‌ని జ‌గ‌న్ అన్నారు. `డిసిప్లనరీ యాక్షన్ తీసుకున్నామన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశ్నాపత్రం వాట్సాప్ లో వ్యాపించిందంటున్నారు? మరి అలాంటప్పుడు ఎందుకు పరీక్ష క్యాన్సిల్ చేయలేదు` అని జ‌గ‌న్ సూటిగా నిలదీశారు. లక్షలాదిమందికి సంబంధించిన వ్యవహారం ప్రభుత్వానికి చిన్నదిగా కనిపించడం బాధాకరమన్నారు. వాళ్ల స్టూడెంట్స్ కు ఈ మాదిరిగా పేపర్ లీకే చేసి పంపిస్తుంటే నారాయణ యాజమాన్యాన్ని ఎందుకు బ్లాక్ లిస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

`సాక్షాత్తు నారాయణ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం మంత్రిది. ఆయన  వియ్యంకుడు గంటా ఎడ్యుకేషన్ మినిస్టర్ .దీనికి బాధ్యులైన వీరిద్దరినీ తొలగించాలి `అని డిమాండ్ చేశారు.పేపర్ లీకేజ్ ఘటనపై అటెండర్లు, ఇన్విజిలేటర్లపై యాక్షన్ తీసుకొని చేతులు దులుపుకోవడం కాదని...మంత్రి నారాయణను ఆయనకు సపోర్ట్ చేసిన గంటాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి ఇన్సిడెండ్ జరిగితే ముద్దుక్రిష్ణమనాయుడు రిజైన్ చేశారు. వేరే రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా జరిగితే ముఖ్యమంత్రులు రాజీనామా చేయడం చూశామన్నారు. నారాయణ పిల్లలకు ర్యాంకులొచ్చేలా పేపర్ ను లీక్ చేస్తుంటే...ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే, సీబీఐ ఎంక్వైరీ జరిపించాల్సింది పోయి... దీన్ని చిన్నవిషయంగా ప్రభుత్వం కొట్టిపారేయడం దారుణమన్నారు. చంద్రబాబు తన మంత్రులను కాపాడుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు.   పేపర్ లీకేజ్ అయి బయటకొస్తుంది, యాక్షన్ తీసుకోవాలని మంచి సిటిజన్ గా సాక్షి రిపోర్టర్ బయటపెడితే...అది తప్పన్నట్టుగా ప్రభుత్వం ఆ ఉద్యోగిపై నిందలు వేయడం దారుణమని జ‌గ‌న్ అన్నారు. ర్యాంకులు సంపాదించుకునేవాడు కష్టపడి చదివి ర్యాంకులు రావాలని ఆరాటపడతాడు.  కానీ నారాయణ కాలేజీలో లక్షల ఫీజులు కడితే మాత్రమే ర్యాంకులొస్తాయని ప్రభుత్వమే దగ్గరుండి సపోర్ట్ చేయడం బాధాకరమన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jagan 
  • 10th Class Question Paper Leakage 
  • Andhra Assembly 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS