• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగనొచ్చారు..ఏపీలో ఐఏఎస్...

జగనొచ్చారు..ఏపీలో ఐఏఎస్ లకు కొరత వచ్చేసింది

By - Tupaki Desk
Update: 2019-05-26 04:15 GMT
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విపక్ష పార్టీ హోదాలో బరిలోకి దిగిన వైసీపీ... రికార్డు విక్టరీని నమోదు చేసింది. 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లను - 25 ఎంపీ సీట్లలో 22 సీట్లను వైసీపీ గెలిచింది. ఈ మేర వైసీపీకి దక్కిన విజయాన్ని రికార్డు విజయంగానే చెప్పక తప్పదు. రికార్డు విజయం సరే గానీ... వైసీపీ మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్ ఈ నెల 30న సీఎంగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మరి తర్వాతి పరిస్థితి ఏంటి?

పాదయాత్రలోనే కాకుండా.... జనంతో మమేకమైన ప్రతి సందర్భంలోనూ జగన్ చాలా హామీలనే ఇచ్చారు. ఈ హామీల్లో తాను అధికారంలోకి వస్తే... ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. రాఫ్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పారు కదా. ఒక్కసారి హామీ ఇస్తే... జగన్ వెనక్కు తగ్గరు కదా. అంటే... 25 జిల్లాల ఏర్పాటు కూడా ఖాయమే కదా. మరి కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటైతే... ఇప్పుడున్న 13 జిల్లాలకు సరిపడ ఐఏఎస్ - ఐపీఎస్ అధికారులే రాష్ట్రంలో లేరు. మరి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అధికారులకు కొరతే కదా. మరి ఆ కొరతను అధిగమించడం ఎలా?

రాష్ట్ర స్థాయి పోస్టులు అయితే.. ఏపీపీఎస్పీ ద్వారా ఎలాగోలా భర్తీ చేసుకోవచ్చు. మరి ఐఏఎస్ - ఐపీఎస్ లంతా సివిల్ సర్వీసుల నుంచి వచ్చే వారు కదా. కేంద్రం నిర్ణయం ఆధారంగానే వారి కేటాయింపు జరుగుతుంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ తరహా పరిస్థితే ఇప్పుడు తెలంగాణలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాల పాలనతో పాటు రాష్ట్ర పాలనలోనూ కలెక్టర్లదీ కీలక భూమిక కదా. ఆ పోస్టుకు సరిపడ ఐఏఎస్ లు ఉంటేనే పాలన సాఫీగా సాగుతుంది. మరి సరిపడినంత మంది ఐఏఎస్ లు - ఐపీఎస్ లు లేకుండా జగన్ కొత్త జిల్లాల ఏర్పాటును ఎలా చేస్తారో చూడాలి.


Tags:    
  • Jagan 
  • IAS 
  • IPS officers 
  • Andhra 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS