చంద్రబాబును డిజప్పాయింట్ చేసిన జగన్
రైతుల పట్ల జగన్ వైఖరిపై చంద్రబాబునాయుడు జగన్ ను తప్పు పట్టారు. రైతు సంఘాల దేశవ్యాప్త బంద్ పై మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపోయారు. విషయం ఏమిటయ్యా అంటే భారత్ బంద్ కు వైసీపీ మద్దతు పలికిందట. రైతుల గొంతుకోసే వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో మద్దతు పలికిన వైసీపీ ఇఫుడు బంద్ కు ఎలా మద్దతిచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతోనే జగన్ ద్వంద్వ వైఖరి బయటపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇచ్చింది వైసీపీ మాత్రమే కాదు టీడీపీ కూడా మద్దతు పలికింది. జగన్ ది ద్వంద్వ వైఖరి అయితే మరి చంద్రబాబుది ఏమిటి ? ద్వంద్వ వైఖరి కాదా ? ఎందుకంటే రైతు సంఘాల దేశవ్యాప్త బంద్ కు టీడీపీ కూడా మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు పార్లమెంటులో మద్దతు పలికిన టీడీపీ మరి తాజా దేశవ్యాప్త బంద్ కు మద్దతు ఎలా పలికిందో చంద్రబాబు చెప్పగలరా ?
అధికారపార్టీకి అంటే చాలా మొహమాటాలుంటాయి కాబట్టి పార్లమెంటులో ఒకలాగ బయట మరోలాగ వ్యవహరిస్తోందని అనుకుందాం కాసేపు. మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా వైసీపీ లాగే ఎందుకని పార్లమెంటులో ఒకలాగ బయట మరోలాగ వ్యవహరిస్తోంది ? అంటే నరేంద్ర మోడీ కటాక్షం కోసం పార్లమెంటులో వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికిన చంద్రబాబు రాష్ట్రంలో రైతుల ఓట్ల కోసం బంద్ కు మద్దతు పలుకుతున్నారనే అనుకోవాలి.
ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే రెండు రకాలుగా ఆలోచిస్తే మరి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచించాలి ? ఇక్కడ గమనించాల్సిందేమంటే రైతుల బంద్ కు చాలా రోజుల క్రిందటే టీడీపీ మద్దతు పలికింది. వైసీపీ ఎలాగు మద్దతిచ్చే అవకాశం లేదని అనుకుని బంద్ సందర్భంగా జగన్ను టార్గెట్ చేయచ్చని చంద్రబాబు అండ్ కో ప్లాన్ చేసుకున్నారు. అయితే వాళ్ళ అంచనాలకు భిన్నంగా బంద్ కు రెండు రోజుల ముందు ప్రభుత్వం కూడా బంద్ కు మద్దతు పలికింది.
ప్రభుత్వం నిర్ణయంతో చంద్రబాబు అండ్ కో అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. జగన్ చేసింది తప్పయితే తాను చేసింది కూడా తప్పే అన్న విషయం చంద్రబాబుకు తెలీదా ? బాగా తెలుసు అయినా జగన్ పై బురద చల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టే నోటికొచ్చింది మాట్లాడేశారు. అయినా జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంత మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంటుంది ? రైతాంగం మాట్లాడితే జగన్ కు నష్టం.