పవన్ భావిస్తున్న అద్భుతం ఇదేనా?

Update: 2022-05-09 04:29 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాల్లో స్పష్టంగా ఉంటారు. ఆయన్నుకన్ఫ్యూజింగ్ మాస్టర్ గా ప్రొజెక్టు చేయటం ఒక వ్యూహంలో భాగమే తప్పించి.. ఆయనలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పాలి. అన్నింటికి మించి పవన్ లో కనిపించని మంచి గుణం ఏమంటే కపటత్వం. అదే సమయంలో ఇప్పుడున్న రాజకీయంలో నిజాల్ని నిజాయితీగా మాట్లాడకుండా.. వాటిని ట్విస్టు చేయటం.. భావోద్వేగాల్ని టచ్ చేయటం లాంటివెన్నో గుణాలు ఆయనలో కనిపిస్తాయి. వేప.. కాకరకాయ లాంటివి తిన్నంతనే చేదుగా అనిపిస్తాయి. కానీ.. వాటితో కలిగే ఆరోగ్యంతో పాటు.. చేదులా కనిపించే వీటిల్లోని తీపిని గుర్తించేటోళ్లు చాలామందే ఉంటారు.

పవన్ రాజకీయం కూడా ఇలానే ఉంటుంది. మిగిలిన రాజకీయ అధినేతల మాదిరి తనకు కీలక పదవుల్లో కూర్చునే ఆసక్తిని ప్రదర్శించరు. ఆ మాటకు వస్తే.. ప్రజల కష్టాలు తొలిగితే చాలు.. తనకు ఎలాంటి పదవులు వద్దని స్పష్టం చేస్తుంటారు. సమాజంలో మార్పులు.. సామాన్యుల జీవితాలు మెరుగుపడాలనే తపన తప్పించి.. మరింకేమీ కనిపించవు. నిజానికి పవన్ కున్న ఇమేజ్ కు.. ఆయన్ను తీవ్రంగా తిడుతూ నోరు పారేసే వారి విషయంలో పవన్ చిన్నపాటి సంకేతాలు ఇస్తే చాలు.. విమర్శలతో ఉతికి ఆరేస్తారు.
Read more!

కానీ.. ఈ తరహా రాజకీయానికి పవన్ దూరంగా ఉంటారు. ఇలాంటి వాటితో అనవసరమైన సౌండ్ పొల్యూషన్ తప్పించి.. మరెలాంటి ప్రయోజనం ఉండదన్న భావనను వ్యక్తం చేస్తుంటారు. ఈకారణంతోనే ఆచితూచి అన్నట్లు మాట్లాడటం పవన్ మార్కు రాజకీయంగా చెప్పాలి.

తాజాగా మరోసారి వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పవన్ స్పందించారు. చివరగా.. పొత్తుల మీద క్లారిటీ ఇవ్వాలన్నప్పుడు మాత్రంఆయన పది సెకన్లుగ్యాప్ తీసుకొని.. ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

మరి.. పవన్ మాటల్లోని మర్మం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటు చీలకుండా ఎలా ముందుకు వెళుతున్నారు? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు.. 'ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నా' అంటూ మాట దాటేశారు. కానీ.. పవన్ మాటల్ని చూస్తే.. వచ్చే ఎన్నికల నాటికి అయితే 2014 సీన్ రిపీట్ కావటం కానీ.. లేదంటే టీడీపీ.. జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదుంటున్నారు.

ఎందుకంటే.. పవన్ మాటల్లో ఇప్పటివరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నామని చెప్పారే తప్పించి.. ఎప్పటికి ఉంటామన్న మాటను చెప్పక పోవటాన్ని మర్చిపోకూడదు. అద్భుతం మాట వెనుక అర్థం.. టీడీపీతో పాటు మరే ఇతర పార్టీలతో కూడా పొత్తు పెట్టుకొని.. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపటమే పవన్ లక్ష్యమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News