ఫైజర్​ టీకా ఇండియాకు వచ్చేస్తోందా? అసలు నిజం ఏమిటి?

Update: 2020-12-04 07:54 GMT
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్​ వచ్చేస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మేము ముందు తీసుకొస్తున్నామంటూ రష్యా స్పుత్నిక్​​-వీ వ్యాక్సిన్​ను ప్రకటించింది. అయితే ఈ వ్యాక్సిన్​ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని సమాచారం. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు వ్యాక్సిన్​ తయారీలో నిమగ్నమయ్యాయి. మనదేశంలోనూ సీరం ఇన్​స్టిట్యూట్​, భారత్​బయోటెక్​ వ్యాక్సిన్​ తయారీ లో ముందున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన వ్యాక్సిన్​ మాత్రం అమెరికా తయారు చేసిన ‘ఫైజర్’ వ్యాక్సిన్​. ఈ వ్యాక్సిన్​ అన్ని దశల క్లినికల్​ ట్రయల్స్​లో మెరుగైన ఫలితాలు సాధించినట్టు సమాచారం.

మరోవైపు ఈ వ్యాక్సిన్​ను బ్రిటన్​ ప్రభుత్వం కూడా ఆమోదించింది. త్వరలోనే అక్కడ వ్యాక్సినేషన్​ చేయబోతున్నారు. బ్రిటన్​లో వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిందని తెలియగానే పలువురు ధనవంతులైన భారతీయులు ​బ్రిటన్​కు పయనమయ్యారు. ఇందుకోసం పలు ట్రావెల్​ కంపెనీలు కూడా ఆఫర్లతో ముందుకొచ్చాయి. అయితే ఈ ఫైజర్​ వ్యాక్సిన్​ ఇండియాలోకి కూడా అందుబాటులోకి రాబోతున్నదని .. ఈ వ్యాక్సిన్​ ఇండియన్​ మెడికల్ కౌన్సిల్​ ఆమోదించబోతున్నదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంతవరకు రాలేదు.  డిసెంబర్ 15 తర్వాత బ్రిటన్ వచ్చే విదేశీయులంతా కచ్చితంగా వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిందే అనే నిబంధన పెట్టింది. అయితే ఫైజర్​ వ్యాక్సిన్​ మనదేశంలో నిల్వ చేసే అవకాశం ఉన్నదా? అందుకోసం మనవద్ద తగిన పరికరాలు ఉన్నాయా? లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. ఫైజర్​ టీకాను -70 డిగ్రీల ఉష్టోగ్రతలో మాత్రమే నిల్వ చేసుకోవాలని కంపెనీ హెచ్చరించింది. అయితే టీకా వేయించుకొనేందుకు లక్షలు ఖర్చుపెట్టుకొని విదేశాలకు వెళ్లేందుకు భారతీయులు సిద్ధపడిన నేపథ్యంలో ఆ వ్యాక్సిన్​ ను ఇండియా కే తీసుకొస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం అయితే రాలేదు.
Tags:    

Similar News