• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దూసుకొస్తున్న బాణం.....

దూసుకొస్తున్న బాణం.. కేసీఆర్ తెగ ఇబ్బంది పడుతున్నారా?

By - Tupaki Desk
Update: 2022-12-05 04:32 GMT
ఒకరు నీ గురించి గొప్పగా చెప్పనప్పుడు.. నీ గొప్పతనాన్ని కీర్తించనప్పుడు.. నీ గురించి ఎవరో కాకుండా నువ్వే మాట్లాడితే సరిపోతుంది కదా? ఈ సూత్రాన్ని ఇతర రంగాలతో పోలిస్తే రాజకీయ రంగంలో మా జోరుగా వాడేస్తుంటారు. తమను తాము పొగుడుకోవటానికి అధినేతలు ఏ మాత్రం వెనుకాడరు. తమ సత్తా ఏమిటో మాటలతో చెబుతూ.. తేడా వస్తే చేతల్లో చూపిస్తామని చెబుతామంటారు. ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెబుతున్నారు.

తనను చూసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బయపెడుతున్నారంటూ తాజాగా షర్మిల ఇచ్చిన స్టేట్ మెంట్ ఆమె తన ఇమేజ్ గ్రాఫ్ ను కాస్తంత పెంచుకొని చెప్పారనే చెప్పాలి. తెలంగాణ లో పార్టీ పెట్టిన సమయంలో ఆమె మీద ఎలాంటి ఆశలు లేవు. సరైన నేత ఒక్కరు ఆమె వెంట లేరు.

సఅయినప్పటికీ ఆశ కోల్పోకుండా.. ఏటికి ఎదురీదినట్లుగా ఆమె తీరు ఉంది. తాను ఏం చెప్పినా మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరన్న స్థాయి నుంచి అదే పనిగా పాదయాత్రను నిర్వహించటం ద్వారా.. తెలంగాణప్రజలు తన గురించి మాట్లాడే పరిస్థితిని కల్పించారు. ఆమె లక్ష్యం చూస్తే.. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేసి.. తెలంగాణను ఏలేయాలన్న ఆలోచన ఏమీ లేదని చెబుతారు.

స్లో అండ్ స్టడీ అన్న చందంగా తెలంగాణలో తనను ఆమోదించే వరకు వెయిట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే సుదీర్ఘ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతారు. మిగిలిన వారికి భిన్నంగా తన టార్గెట్ గులాబీ బాస్.. ఆయన కుటుంబ సభ్యులని తేల్చిన షర్మిల.. తన 3500కిమీ పాదయాత్ర సందర్భంగా తాను యాత్ర చేసిన నియోజకవర్గాలు.. వాటి ఎమ్మెల్యేల పని తీరు మీద తనకు అందిన గ్రౌండ్ రిపోర్టును ప్రజల ముందు పెట్టటంద్వారా అటు గులాబీ నేతలకు మాత్రమే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం  ఆరోపణలతో ఉతికి ఆరేస్తున్న పరిస్థితి.

తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి.. తన సవాల్ కు ప్రతి సవాల్ విసిరి.. గ్రౌండ్ లోకి వచ్చి తాను చెప్పినవన్నీ అబద్ధాలనే విషయాన్ని తేలిస్తే.. తాను నేలకు ముక్కు రాసి వెళ్లిపోతానని చెప్పే షర్మిల మాటలు ఇప్పుడిప్పుడే మెదడులోకి ఎక్కుతున్న పరిస్థితి. ఈ విషయాన్ని గులాబీ బాస్ గుర్తించే.. దానికి అడ్డుకట్టే వేసేందుకు వీలుగా ఆమె యాత్రకు నో అనుమతి అన్న విషయాన్ని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.

అంతే కాదు.. తాను.. తన కుటుంబ సభ్యులు ఎవరూ షర్మిల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటం ద్వారా బాణం వేగాన్ని తగ్గించటంతో పాటు.. దిశను కూడా మార్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.  ఏమైనా గులాబీతోటను లక్ష్యంగా చేసుకొని దూసుకొస్తున్న బాణం తీవ్రతను గులాబీ దళపతి గుర్తించినట్లే అన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • KCR 
  • YsSharmila 
  • Politics 
  • Telangana 
  • Government 
  • TRS 
  • YSR 
  • TelanganaParty 
  • PoliticalNews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS