• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రభుత్వాలపైనే కోర్టు...

ప్రభుత్వాలపైనే కోర్టు దిక్కరణ కేసులా ?

By - Tupaki Desk
Update: 2021-05-01 17:30 GMT
గతంలో సుప్రింకోర్టు ఎప్పుడూ ఇంతస్ధాయిలో కేంద్రప్రభుత్వానికి హెచ్చరికలు పంపినట్లు లేదు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అనేక అంశాలపై సుప్రింకోర్టు కేంద్రంపై చాలా ఘటుగా స్పందిస్తంది. అంతేకాకుండా తీవ్రమైన హెచ్చరికలు, వ్యాఖ్యలు చేస్తుండటం సంచలనంగా మారింది. అత్యున్నత ధర్మాసనం చేస్తున్న హెచ్చరికలు, వ్యాఖ్యలు చూస్తుంటేనే కరోనా నియంత్రణలో కేంద్రప్రభుత్వం విఫలమైందన్న విషయం జనాలకు స్పష్టంగా అర్ధమైపోతోంది.

తాజాగా కరోనా వైరస్ బాధితుల ఆర్తనాదాలు, సమస్యల బటయప్రపంచానికి తెలియకుండా అడ్డుకుంటే ప్రభుత్వాలపై కోర్టు థిక్కారణ కేసులను నమోదు చేయాల్సుంటుందని చేసిన హెచ్చరిక కలకలం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఓ ఘటనపై స్పందించిన సుప్రింకోర్టు యావత్ దేశానికి హెచ్చరికచేయటం గమనార్హం. బాధితులు తమ బాధలను సమాజంతో పంచుకోవటం తప్పెలాగ అవుతుందంటు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది.

వ్యాక్సిన్ కొరతను, ఆక్సిజన్ అందకపోవటాన్ని, బెడ్లు లేకపోవటం, వైద్య సేవల్లో లోపాల గురించి బాధితులు బాహ్య ప్రపంచానికి తెలియజేయటం తప్పేమీకాదంటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి గట్టిగా తలంటింది. బాధితుడి మీద పెట్టిన కేసును వెంటనే ఎత్తేయాలని పోలీసులను సుప్రింకోర్టు ఆదేశించింది. కరోనా ఉదృతిని జాతీయ సంక్షోభంగా వర్ణించిన సుప్రిం ధర్మాసనం సమస్యలను సమాజం ముందచటంలో తప్పేలేదన్నది. బాధితుల నోర్లు మూయించాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తే తాము చూస్తు ఊరుకునేది లేదని చాలా ఘాటుగానే హెచ్చరించింది.

పైగా టీకాల ధరలపై ఉత్పత్తి కంపెనీల నియంత్రణ ఏమిటంటు కేంద్రాన్ని నిలదీసింది. ఏ రాష్ట్రానికి ఎంత టీకాలు సరఫరా చేయాలన్నది రాష్ట్రాల అవసరాలే కానీ కంపెనీల ఇష్టంకాదని స్పష్టంగా కేంద్రానికి చెప్పింది. రాష్ట్రాల అవసరాలు ఏమిటో కేంద్రం గమనించి దాని ప్రకారమే ఫార్మాకంపెనీల నుండి సరఫరా చేయించాలని గట్టిగా చెప్పింది. మొత్తానికి టీకాల కొరత, ఆక్సిజన్ సమస్యలతో పాటు అనేక అంశాలపై  సుప్రింకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా ఘాటుగానే స్పందించింది.
Tags:    
  • governments 
  • India 
  • Uttar Pradesh 
  • telugu news 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS