• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ మాజీ మంత్రి పార్టీ...

వైసీపీ మాజీ మంత్రి పార్టీ మారాల్సిందేనా...?

By - Tupaki Desk
Update: 2022-12-11 16:30 GMT
ఆయన చిరకాల కోరిక మంత్రి పదవి చేపట్టడం. దాన్ని ఆయన వైసీపీలో చేరి నెరవేర్చుకున్నారు. మూడేళ్ల పాటు ఆయన మినిస్టర్ హోదాను అనుభవించారు. అయితే ఆరు నెలల క్రితం మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోయి మాజీ అయ్యారు. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాసరావు. ఆయనకు అప్పట్లో విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు.

కానీ రీసెంట్ గా ఆ పదవి కూడా పోయింది.ఆయన జస్ట్ భీమిలీ ఎమ్మెల్యే మాత్రమే. పార్టీలో ఆయన ప్రాధాన్యత అమాంతం తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. అదేంటి అంటే ఆయనకు వైసీపీ అధినాయకత్వం నియమించిన పార్టీ పెద్దలతో మంచి రిలేషన్స్ లేవు అంటారు. ఆయన వారితో సాన్నిహిత్యంగా ఉండడంలేదు అని అంటారు. గతంలో విశాఖ వైసీపీ వ్యవహారాలను విజయసాయిరెడ్డి చూసేవారు.

ఆయనతోనూ అవంతికి పడేది కాదని చెప్పేవారు. తనను మంత్రిగా స్వేచ్చగా పనిచేసుకోనీయకుండా ఎంపీ వ్యవహరించేవారు అని అవంతి నాడు  హర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయని చెబుతారు. ఆయన తరువాత వచ్చిన వైవీ సుబ్బారెడ్డితోనూ అంతంతమాత్రమైన రిలేషన్స్ నే మెయింటెయిన్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన పేరిట అంటూ ప్రచారం జరిగిన ఆడియో క్లిప్స్ అందులో అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయని విపక్షాల విమర్శల నేపధ్యంలో కూడా మాజీ మంత్రిని అధినాయకత్వం దూరం పెట్టినట్లుగా చెబుతున్నారు.

ఇంకో వైపు చూస్తే భీమిలీలో టీడీపీ పట్టు పెరిగింది. ఆ పార్టీకి కంచుకోట లాంటి సీటు అది. దాంతో చేసిన సర్వేలలో సైతం అవంతికి వ్యతిరేకంగా నివేదికలు రావడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోరు అని ప్రచారం గట్టిగా సాగుతోంది. భీమిలీలో ఈసారి కొత్త ముఖానికే చాన్స్ ఉంటుందని అంటున్నారు.

మరి ఈ నేపధ్యం నుంచి చూస్తే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడింది అనే అంటున్నారు. ఆయనకు టికెట్ దక్కదు అని సొంత పార్టీలోనే గుసగుసలు పోతున్నారు. ఆయన ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది అని అంటున్నారు. మరి అవంతి రెండు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూశారు. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే, ఒక సారి ఎంపీగా పనిచేశారు. మంత్రిగా కూడా చేశారు.

వైసీపీ కనుక ఆయనకు టికెట్ లేదు అని చెబితే ఆయన ఏం చేస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు చూసిన అవంతి తన రాజకీయ భవిష్యత్తు కోసం మరో మారు పార్టీ మరే చాన్స్ ఉందంటూ ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. వైసీపీ హై కమాండ్ ఆయన విషయంలో ఏదో ఒకటి తేల్చేస్తే కనుక అవంతి తన ఫ్యూచర్ ప్లాన్స్ ని అమలులో పెడతారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అవంతి రాజకీయం ఇలా వెలిగి అలా మలిగిపోయింది అనే అంతా అంటున్నారు. దానికి ఆయన స్వయంకృతం కూడా ఉందని సొంత పార్టీలోనే టాక్ ఉందిట. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • APAssemblyElections 
  • YSRCPGovernment 
  • APPolitics 
  • YSJaganMohanReddy 
  • APGovernment 
  • AvanthiSrinivas 
  • BheemiliMLA 
  • AvanthitoChangeParty 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS