బండారు దత్తాత్రేయకు ఘోర అవమానం

Update: 2021-02-26 14:45 GMT
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ  రణరంగమైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ప్రతిపక్ష నేత సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు స్పీకర్ సస్పెండ్ చేసేశారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం గవర్నర్ దత్తాత్రేయ అసెంబ్లీకి హాజరయ్యారు. సమావేశం మొదటి నుంచే కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ ఆటంకపరిచారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.

అయినా దత్తాత్రేయ ప్రసంగం పూర్దొ చేసుకుంటూ వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నెట్టివేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార బీజేపీ సభ్యులు దీనిపై తీవ్రంగా మండిపడ్డారు.  

గవర్నర్ దత్తాత్రేయను నెట్టేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ మండిపడ్డారు. వెంటనే వారిని సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టించారు.

దీంతో కాంగ్రెస్ పక్ష నేత సహా నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. మార్చి 20 వరకు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపారు.
Tags:    

Similar News