రూల్స్ బ్రేక్ చేస్తే.. పదవి ఫట్..! గ్రామాల్లో కొత్త నిబంధనలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇవాళ నాలుగోదశ పోలింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడబోయే గ్రామపంచాయతీలకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. కొత్తగా ఏర్పడబోయే పంచాయతీలు ఎలా పరిపాలన కొనసాగించాలో తదితర వివరాలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ఈ మార్గదర్శకాలు అందుబాటులోకి రానున్నాయి.
కొత్త రూల్స్‌లో ఏముంందటే..
ప్రతి పంచాయతీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటీసు బోర్డులో రాయాలి. ప్రభుత్వం ఇచ్చే నిధులుతో సహా వివరాలను పొందుపరచాలి. ప్రతి నెల గ్రామసభ నిర్వహించాలి. ఇంటి పన్నులు, ఇతర పన్నులు ఎన్ని వసూలయ్యాయి. ఇంకా ఎన్ని వసూలు కావాల్సిఉంది.. తదితర వివరాలను అక్కడ రాయాలి.
నెలకొసారి గ్రామంలో వీధి దీపాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఒకవేళ ఎక్కడైనా స్ట్రీట్ లైట్ వెలగకపోతే వెంటనే అమర్చాలి. అందుకు సంబంధించిన వివరాలు కూడా నోటీసు బోర్డులో పెట్టాలి.
మరుగుదొడ్ల వాడకం, చెత్త సేకరణపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలి. రేషన్ షాప్‌లో బియ్యం ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి. బయటి సరుకులు రేషన్ షాప్‌లో అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. గ్రామంలో ప్రతి మనిషికి కి ప్రభుత్వం రూ.132.00 రూ ప్రభుత్వం ఇస్తుంది.
ఉదాహరణకు గ్రామంలో 6000 మంది ఉంటే రూ.8 లక్షల గ్రామపంచాయతీలకు ఇస్తుంది. ఈ డబ్బులను దేనికి వాడుతున్నారో గ్రామపంచాయతీ చెప్పాలి. ఈ రూల్స్ అని కచ్చితంగా పంచాయతీ పాటించాలి. లేదంటే వాళ్ల పదవి ఊడినట్టే.