మోడీ ఆ పనిచేసస్తే.. బీజేపీకి పెద్ద నష్టమే!
అధికారంలో ఉన్నవారు.. వేసే ప్రతి అడుగు.. జాగ్రత్తగా ఉండాలి. ప్రజల ఆమోదం.. తమకు ఉంది కదా.. ఎన్నికల్లో భారీ ఎత్తున సీట్లు.. ఓట్లు వచ్చాయి కదా.. మనం ఏం చేసినా.. ఎవరు అడుగుతారు? అనే ధోరణి లో ముందుకు సాగితే.. అన్నీ గమనిస్తున్న ప్రజలు.. ఎక్కడ వాత పెట్టాలో అక్కడ ఖచ్చితంగా పెడతారు.. అంటున్నారు పరిశీలకులు.
ఎన్నికల్లో విజయం ఎంత ముఖ్యమో.. పాలన వ్యవహారంలో తీసుకునే జాగ్రత్తలు కూడా అంతే మొత్తం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు ఇటీవల తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు అవకాశం కల్పిస్తున్నాయి.
ప్రభుత్వ రంగం సంస్థలను ప్రైవేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. నిజానికి కొన్ని చర్యలు తీసుకుని వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తే..వాటి వల్ల ప్రభుత్వానికి మేలు జరు గుతుందని.. తెలిసినా.. మేధావులు చెబుతున్నాకూడా.. ఆయన ఎక్కడా పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలోనే.. ఇప్పుడు బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ఆయన తహతహ లాడుతున్నారు. ఇది ఆయనకే కాకుండా..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి కూడా పెను నష్టం చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి 1976-77 మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. బ్యాంకులను జాతీయీకరణ చేశారు. ఇది ఆమెకు .. ఆమె పార్టీకి.. చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ.. పాఠ్యాంశాల్లో ఇది నిలిచిపోయింది. ఎన్ని తప్పులు చేసి ఉండొచ్చు.. కానీ, ఆమె చేసిన మంచి పనుల్లో.. ఇది ప్రధానంగా ఉంది.
కానీ.. ఇప్పుడు గాంధీలపై కోపంతోనో.. లేదా.. కార్పొరేట్ వర్గాలపై ప్రేమతోనో.. మోడీ.. ఇదే బ్యాంకింగు రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే.. అనేక బ్యాంకులను విలీనం చేశారు. నిజానికి నష్టాల్లో లేని ఆంధ్రాబ్యంకు, కార్పొరేషన్ బ్యాంకు వంటివాటిని కూడా విలీనం చేయడం.. అప్పట్లో విమర్శలకు దారితీసింది.
ఇక, ఇప్పుడు..ఏకంగా.. వీటిని ప్రైవేటీ పరం చేయాలని తలపోస్తున్నారు. వాస్తవానికి 75వ స్వాతంత్య్ర సమరోద్యమాన్ని ఆజాదీకా అమృత్ పేరుతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గాంధీ ప్రారంభించిన యూనియన్ బ్యాంకు ను సైతం.. ప్రైవేటీకరిస్తారనే వార్తలు వస్తున్నాయి.
గాంధీ ఎన్నో ఆశలతో దీనిని ఏర్పాటుకు తెరచాటున కృషి చేశారు. కానీ, ఇవన్నీ.. ఇప్పుడు ప్రైవేటు పరం కానున్నాయి. అయితే.. ఇప్పటికే.. ప్రైవేటు వర్గాలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన లక్షల కోట్ల రూపాయలను మోడీ సర్కారు దాదాపు మాఫీ చేసింది.
ఈ క్రమంలో బ్యాంకులకు రూ.5 లక్షల కోట్లు రాయితీ రూపంలో ఇచ్చేసింది. ఇదంతా ప్రజాధనమే. ఒక పేద వాడు ఒక వెయ్యి రూపాయలు బ్యాంకులకు అప్పు ఉంటే..గోళ్లు ఊడగొట్టి మరీ.. వసూలు చేస్తున్న బ్యాంకులు.. కార్పొరేట్ సంస్థలు తీసుకున్న అప్పులు మాత్రం వసూలు చేసుకోలేక పోతున్నాయి.
ఇలాంటి సమయంలో ఇక, ఇప్పుడు నేరుగా ప్రజల సొమ్మును ప్రైవేటు బ్యాంకులకు అప్పగిస్తే.. వారి నగదుకు భద్రత ఎక్కడ ఉంటుంది? అనేది ప్రశ్న. అదానీ, అంబానీ, చౌక్సీ వంటివారికి బ్యాంకింగ్ రంగం అప్పగిస్తే.. ప్రజలకు ఒనకూరే ప్రయోజనం కన్నా.. నష్టమే ఎక్కువ అంటున్నారు పరిశీలకులు. మోడీ మొండిగా కనుక ముందుకు వెళ్తే.. ఈ పరిణామం ఆయనకే నష్టం చేస్తుందని కుండబద్దలు కొడుతున్నారు.