సీఎం కేసీఆర్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్‌

Update: 2020-09-30 17:57 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్‌ వి. శేషాద్రి నియమితులయ్యారు. 999 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శేషాద్రి గత ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసులో పనిచేశారు. ప్రధాన మంత్రి కార్యాలయ బాధ్యతల్లో ఉన్న శేషాద్రి అక్కడ సర్వీసులు విజయవంతంగా ముగించుకున్నారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేసిన శేషాద్రికి ప్రభుత్వం రెవెన్యూ/భూ చట్టాల సమీక్ష బాధ్యతలను కట్టబెట్టింది. రెవెన్యూ శాఖలో కీలక ముద్ర వేసిన శేషాద్రికి రంగారెడ్డి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ గా - కలెక్టర్‌ గా పనిచేసిన అనుభవం ఉంది. యూఎల్సీ ప్రత్యేకాధికారిగా కూడా పని చేసిన శేషాద్రి రెవెన్యూ శాఖలో పలు కీలక ఉత్తర్వులిచ్చారు.

రికార్డ్‌ ఆఫ్‌ రైట్‌(ఆర్‌ వోఆర్‌) చట్టాన్ని అనుసరించి, ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చిరస్థాయిగా నిలిచిపోయాయని రెవెన్యూ అధికారులు చెబుతుంటారు. బెంగళూరులోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి పట్టభద్రుడైన శేషాద్రికి రెవెన్యూ చట్టాలపై గట్టి పట్టుంది. వాస్తవానికి - భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్ఏ) - రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో ఒకటి శేషాద్రికి దక్కనుందని ప్రచారం జరిగింది. అయితే, మితభాషి, సమర్థుడైన అధికారిగా పేరుపొందిన శేషాద్రిని సీఎం కేసీఆర్ సెక్రటరీగా నియమించుకున్నారు. .
Tags:    

Similar News