ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడను...'రాహుల్' షాకింగ్ కామెంట్స్ !
నేషనల్ కాంగ్రెస్ కీలక నేత . ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయానికి నేను ఏనాడూ తలొగ్గనని…ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడనని.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడను, ఎటువంటి అన్యాయానికి తల వంచను. అబద్ధాలను నిజంతో జయిస్తా. సత్యంలో ఉంటే శక్తితో జయిస్తా. అసత్యంతో పోరాడుతా. పోరాడుతూనే ఉంటా. ఆ సమయంలో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కొంటా అని అన్నారు.
యూపీలోని హాత్రాస్ ఘటన దేశాన్ని కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడికి వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందేన. వాళ్లను కలవనీయకుండా, రాహుల్, ప్రియాంకను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాదు.. రాహుల్ ను అడ్డగించి ముందుకు వెళ్లనీయకపోవడంతో రాహుల్ కిందపడిపోయారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.