మందుబాబుల గుండె గుభేల్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే 2 నెలలు లిక్కర్ తీసుకోకూడదట !

Update: 2020-12-10 08:37 GMT
కరోనా కట్టడి కోసం పలు దేశాలు వ్యాక్సిన్ తయారీ బాట పట్టిన సంగతి తెలిసిందే. చాలా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ ని సిద్ధం చేశాయి. తమ పౌరులకు టీకాలు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రష్యా కూడా స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది. మన దేశంలో లాగే రష్యాలో కూడా కరోనా తీవ్రంగా ప్రబలింది. ప్రస్తుతం టీకా  సిద్ధం అవడంతో తమ దేశ పౌరులకు అందించే కార్యక్రమాన్ని ఆ దేశం చేపట్టింది.

 అయితే వ్యాక్సిన్ వేసే ముందు వైద్య నిపుణులు మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చారు. కోవిడ్ నిరోధానికి వ్యాక్సిన్ తీసుకుంటే రెండు నెలల పాటు మద్యానికి దూరంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ దేశ ప్రజలతో పాటు మద్యం అధికంగా తీసుకునే దేశాలు షాక్ కు  గురవుతున్నాయి. చాలా దేశాల్లో ప్రజలు నిత్యం మందు తాగడం ఎక్కువే. ఇప్పుడు కరోనా కోసం టీకా  వేసుకుంటుండడంతో రెండు నెలల పాటు మద్యానికి దూరంగా ఉండాలని చెప్పడం నిత్యం మందు తాగేవారికి ఇది నిజంగా షాకింగ్ వార్తే.

 వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత ప్రభావవంతం కావడానికి 42 రోజులు ప్రజలు  అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యానికి దూరంగా ఉండాలని రష్యా ఉప  ప్రధాని గోలికోవా పేర్కొన్నారు. జన సమూహం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించడం తో పాటు శానిటైజర్ లు ఉపయోగించాలని ఆయన సూచించారు. ఎక్కువగా బయట తిరగకుండా సాధ్యమైనంతవరకు సామాజిక దూరం పాటించాలని సూచించారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం మద్యానికి దూరంగా ఉండడం తప్పనిసరి అని ఆయన సూచించారు. బాగా అతిగా మద్యం సేవించే దేశాల్లో రష్యా నాలుగో స్థానంలో ఉంది. దీంతో ఆ దేశ ప్రభుత్వ ప్రకటన వారిని ఆందోళనలో పడేసింది.

కాగా వ్యాక్సిన్  సిద్ధం కావడంతో ప్రజలకు అందించడానికి రష్యా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.ఇప్పటికే లక్ష మందికి పైగా టీకాలు కూడా వేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. మన దేశంలో కూడా మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువ కావడంతో ఈ వార్త విన్న మందుబాబుల గుండె గుభేల్ మంటోంది. మన దేశ ప్రభుత్వం కూడా కరోనాకు టీకా  వేసే సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తుందేమోనని మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News