ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికలన్నింటిలోకి ప్రత్యేకంగా నిలుస్తుంటే.. ఈ సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు కూడా అంతకంటే ప్రాధాన్యం సంతరించుకున్నాయనే చెప్పాలి. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసి ఇప్పటికే నెల రోజులు అవుతోంది. ఫలితాల కోసం ఇంకో 15 రోజులకు పైగానే వేచి ఉండక తప్పని పరిస్థితి. అయితే కౌంటింగ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ గెలుపు గుర్రాలెవరంటూ ఇప్పటిదాకా సాగిన విశ్లేషణలు కాస్తా బెట్టింగ్ బరికి తెర లేపేశాయి. కోడి పందేలకు పుట్టినిల్లుగా ఉన్న పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో ఇప్పటికే బెట్టింగులు ఓ రేంజిలో జరుగుతుండగా... కౌంటింగ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ బెట్టింగులు జోరందుకున్నాయి.
అయితే పశ్చిమ బెట్టింగులను మించి అనంతపురం జిల్లాలో సాగుతున్న కొత్త తరహా బెట్టింగులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకించి జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వారసులుగా బరిలోకి దిగిన జేసీ పవన్, జేసీ అస్మిత్ రెడ్డిల గెలుపుపై జరుగుతున్న బెట్టింగులు మామూలుగా ఉండటం లేదు. బెట్టింగులంటేనే చట్ట వ్యతిరేకం కదా. అలాంటిది ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఏకంగా బాండు పేపర్ల మీద రాసుకుని మరీ బెట్టింగులు కాస్తున్నారట. జేసీ పవన్ పోటీ చేసిన అనంతపురం పార్లమెంటు పరిధిలోని కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ తరహా బెట్టింగ్ ఒకటి ఆసక్తి రేకెత్తిస్తోంది.
జేసీ పవన్ గెలుస్తాడని టీడీపీకి చెందిన ఓ నేత ఏకంగా రూ.25 లక్షలు బెట్టింగ్ కాసేందుకు ముందుకు రాగా... వైసీపీ అభ్యర్థిదే గెలుపు అంటూ ఆ పార్టీకి చెందిన మరో నేత అంతే మొత్తం పందెం కాసేందుకు సై అన్నారట. ఈ క్రమంలో వీరిద్దరూ చెరో రూ.25 లక్షలు ఓ మధ్యవర్తి వద్ద పెట్టేసి... సదరు బెట్టింగు ఒప్పందాన్ని ఏకంగా బాండు పేపర్ మీద రాయించుకున్నారట. ఇలా వీరు రాయించుకున్న ఈ బాండు ఇప్పుడు బయటకు వచ్చేసింది. వైరల్ అయిపోయింది. మొత్తంగా బెట్టింగులకే కొత్త కలరింగులు ఇచ్చేస్తున్న ఈ కొత్త బెట్టింగు... జేసీ పవన్ ను గెలిపిస్తుందో, ఇంటిలో కూర్చోబెడుతుందో చూడాలి.