మానవహక్కులు ఎలా పుట్టాయి.. వాటి చరిత్ర ఏమిటి?

Update: 2020-12-10 06:42 GMT
అణచివేత, దాష్ఠికాల నుంచి విముక్తి కోసం మానవసమాజం ఎన్నో పోరాటాలు చేసింది. కొన్ని వేల ఏళ్ల  పాటు ఇక్కడ సమానహక్కులు లేవు. స్త్రీ పురుష వివక్ష, కుల వివక్ష, జాతి వివక్ష ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పీడించాయి. దశాబ్దాలుగా జరిగిన పోరాటాలతో మనుషులు జీవించే హక్కును సాధించుకున్నారు. చాలా దేశాల్లో ప్రజాస్వామిక పాలన వచ్చాక కూడా అందరికీ ఓటుహక్కు ఉండేది కాదు. ప్రజాప్రతినిధులను కొంతమందే ఎన్నుకొనేవారు. ప్రతి దశలోనూ అనేకపోరాటాలు చేసి ప్రజలు తమహక్కులను సాధించుకున్నారు.

 డిసెంబర్​ 10 (గురువారం) అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం ఈ సందర్భంగా మానవహక్కులపై కొన్ని ఆసక్తికరమై విషయాలు తెలుసుకుందాం. 1948 డిసెంబర్​ 10న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటనచేసింది. అప్పటినుంచి ప్రతి ఏటా ఈ తేదీన మానహక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1789లో రుపొందించిన 'ద డిక్లరేషన్‌ ఆఫ్‌ ద రైట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌ అండ్‌ ద సిటిజన్‌' మానవహక్కులను రూపొందించారు. మొదటి, రెండో ప్రపంచయుద్ధాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చియా. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయారు. అనేకదేశాలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్నాయి. దీంతో 1944లో ప్రపంచదేశాలకు చెందిన ప్రతినిధులు అమెరికాలోని వాషింగ్టన్​లో సమావేశమై యుద్ధాలను నివారించాలని తీర్మానించుకున్నారు. ఈ సమావేశంలోనే ఐక్యరాజ్యసమితి పురుడుపోసుకున్నది.

అలా అన్ని దేశాల ప్రతినిధులు కలిసి ఈ మానవహక్కులను రూపొందించుకున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో పుట్టిన వ్యక్తికైనా జీవించేహక్కు ఉండాలని, ఓటుహక్కు ఉండాలని తీర్మానించారు. ఆ తర్వాత అన్నిదేశాల రాజ్యాంగాల్లోనూ విధిగా హక్కులను పొందుపరిచారు. అప్పటికే రూపొందించిన రాజ్యాంగాల్లో ఈమేరకు సవరణలు చేశారు. మనదేశంలోనూ భావ స్వాతంత్ర్యహక్కు, మతస్వేచ్ఛహక్కు, ఓటుహక్కు, జీవించేహక్కు ప్రజలకు సంక్రమించాయి.
Tags:    

Similar News