పాక్ దుశ్చర్య .. హిందూ, క్రైస్తవ స్త్రీలను చైనాకు పెళ్లికూతుళ్లుగా, ఉంపుడుగత్తెలుగా !

Update: 2020-12-10 07:32 GMT
పాకిస్థాన్ చెప్పేది ఒకటి , చేసేది మరొకటి. ఇతర దేశంలో ఉన్న మైనారిటీల సంక్షేమం గురించి మాట్లాడే పాక్ , తమ దేశంలోని మైనారిటీల గురించి పట్టించుకోదు. ఈ క్రమంలో అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ బ్రౌన్‌బ్యాక్‌ సంచలన విషయాలు వెల్లడించారు. పాక్‌ లోని హిందూ, క్రైస్తవ యువతులను చైనాకు బలవంతపు పెళ్లికూతుళ్లుగా.. ఉంపుడుగత్తెలుగా ఎగుమతి అవుతున్నారని ఆరోపణలు చేశారు. అయన మాట్లాడుతూ ...  ఈ రోజు జరగనున్న వెబినార్‌ చాలా క్లిషమైనది. చైనాకు పంపబడుతున్న బలవంతపు వధువులకు సంబంధించినది ఈ వెబినార్‌. పాకిస్తాన్‌ తన దేశంలోని మైనారిటీలైన క్రైస్తవులు, హిందూ యువతులను ఉంపుడుగత్తెలు, బలవంతపు వధువులుగా చైనాకు అమ్ముతుంది. ఎందుకంటే ఆ దేశంలో వీటిపై ఎవరు నోరు మెదపరు. మతపరమైన మైనారిటీలపై పాక్‌ లో వివక్ష ఉంది. ఇది వారికి మరింత హానీ చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం పాకిస్తాన్‌ ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా నియమించడానికి ఇది ఒక కారణమని అన్నారు.

ప్రస్తుతం డ్రాగన్‌ దేశంలో మహిళల కొరత ఉంది. దాంతో చైనా పురుషులు ఇతర దేశాల మహిళలను వధువు, ఉంపుడుగత్తెలు, కార్మికులుగా దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి పాంపియో పాకిస్తాన్ ‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎందుకు అనే ప్రశ్నకు బ్రౌన్ ‌బ్యాక్ ప్రతిస్పందించారు. పాకిస్తాన్‌లో మతపరమైన హింస చెలరేగినప్పుడు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో చాలా మత ఘర్షణలు జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమర్థవంతమైన పోలీసు, న్యాయపరమైన చర్యలు అమలు జరిగియా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి మేము ప్రయత్నిస్తాము అన్నారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో సోమవారం మత స్వేచ్ఛ పరంగా క్రమబద్ధమైన, కొనసాగుతున్న, అతిగా ఉల్లంఘనలకు" పాల్పడటం వంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న చైనా, పాక్‌తో సహా 8 దేశాలను సందర్శించారు. యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం  భారతదేశాన్ని కూడా ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా  నియమించాలని విదేశాంగ శాఖకు సిఫారసు చేసింది. కానీ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ సిఫారసును అంగీకరించలేదు.
Tags:    

Similar News