హిల్లరీకి ఓటేయొద్దంటున్న మన కోతల రాయుడు

Update: 2016-10-24 07:18 GMT
నోబెల్ శాంతి బహుమతికి ఏడు సార్లు నామినేట్ అయ్యాను... జార్జి బుష్ నా అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తారు.. ఒబామా మనకు బాగా క్లోజ్.. లిబియాతో శాంతి ప్రయత్నాల్లో నేనే ఉన్నాను... సిరియా - ఇరాక్ - సూడాన్ వంటిదేశాల్లో శాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాను.. ప్రపంచ దేశాల అధిపతులకు మనం ఎంత చెబితే అంత... ఇలా కోతలు కోయడంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న మత ప్రచారకుడు కేఏ పాల్  కొద్దికాలంగా సైలెంటుగా ఉన్నప్పటికీ మళ్లీ తన నోరు విప్పుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన కోతలు మొదలు పెట్టారు. అయితే... ఈ సారి ఆయన అమెరికా ఎన్నికలకూ టార్గెట్ చేసి అక్కడి విషయాలపై మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హిల్లరీకి ఓటేయొద్దంటూ పిలుపునిస్తున్నారు. అయితే... కేఏ పాల్ అంటే కోతలు - అతిశయోక్తుల పాల్ అని... ఇది కూడా తన ఇమేజి పెంచుకోవడానికి తగుదునమ్మా అంటూ అమెరికా ఎన్నికల్లో వేలు పెట్టే వ్యవహారమే కానీ ఆయన మాట వినేవారెవరని అంటున్నారు.

కేఏ పాల్ మీడియాతో పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ లో కేఏ పాల్ వీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  అమెరికా అధ్యక్షుడు ఒబామా - లిబియా నేత గడాఫీ మధ్య శాంతి చర్చలకు 2011లో తాను ప్రయత్నించిన సమయంలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ - జనరల్ వెస్లీ క్లార్కులు తనను చంపించాంలనిచూశారని సంచలన ఆరోపణలు చేశారు. మధ్య ప్రాచ్య దేశాల్లోని అశాంతికి - అంతర్యుద్ధాలకు హిల్లరీయే కారణమని పాల్ ఆరోపించారు. ట్రంప్ కు కానీ - ఇతరులకు కానీ ఓటేయండి కానీ... హిల్లరీకి మాత్రం అస్సలు ఓటేయొద్దని ఆయన అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు.



కాగా కేఏ పాల్ మాటల్లో కొన్ని కోతలున్నప్పటికీ ప్రపంచ స్థాయి మత ప్రచారకుడిగా ఆయనకు వివిధ దేశాల అధినేతలు..  ఎన్నో దేశాల్లోని ప్రముఖులు - పారిశ్రామికవేత్తలతో పరిచయాలున్నాయి. కేఏ పాల్ మంచి జోరు మీదున్న సమయంలోనే దిగ్గజ వ్యాపారవేత్తగా ఉన్న ట్రంపుతోనూ ఆయనకు పరిచయాలున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల రేసులో వెనుకబడడంతో కేఏ పాల్ కూడా తన వంతు సాయం చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే... సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీ పెట్టి 10 ఓట్లు కూడా సాధించలేని పాల్ మాటలను ఇప్పుడు అమెరికాలో ఎవరు వింటారన్నదే ప్రశ్న.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News