• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఓట‌మిపై హిల్ల‌రీ...

ఓట‌మిపై హిల్ల‌రీ ఇంటర్వ్యూ ఏం చెప్పారంటే..

By - Tupaki Desk
Update: 2017-06-04 16:47 GMT
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం కొద్ది తేడాలో కోల్పోయిన హిల్లరీ క్లింటన్‌.. ఆ నాటి తన  ఓటమికి దారితీసిన పరిస్థితులపై తొలిసారి స్పందించారు. డెమెక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలోకి దిగిన హిల్లరీ అప్పట్లో ఫేవరెట్‌ గా నిలిచారు. హిల్లరీయే గెలవచ్చని దాదాపు అన్ని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల చివరి దశలో సీన్‌ ఛేంజ్‌ అయ్యింది. ఎన్నికల ఫలితాల్లో హిల్లరీ స్వల్ప తేడాతో ఓడిపోయారు.

రిప‌బ్లిక‌న్ పార్టీ నేత‌ డొనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ ఓటమి సంచలనం రేపింది. దీనిపై డెమెక్రాటిక్ పార్టీ నేతలు సహా హిల్లరీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐతే హిల్లరీ మాత్రం ఈ అంశంపై ఎప్పుడూ స్పందించలేదు. తొలిసారిగా ఈ ఓ ఇంటర్వ్యూలో తన ఓటమికి కారణాలు చెప్పారు హిల్లరీ. తప్పుడు ప్రచారంలో ఆరితేరిన రష్యా వల్లే పరాజయం పాలైనట్లు ఆమె చెప్పారు. పోలింగ్‌ వివరాలు, ఇతర సమాచారం రష్యాకు చేరవేడయంలో ట్రంప్‌ అనుచరులు సాయపడ్డారని ఆరోపించారు. ట్రంప్‌ ప్రచార బృందం, సహచరులకు ఎన్నికల ముందు, అనంతరం రష్యాతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయని...అన్నీ బహిర్గతమైతే సహకరించిన వారి వివరాలు బయటకొస్తాయని చెప్పారు. ఈ–మెయిల్‌ వివాదాన్ని పెద్ద తప్పుగా మీడియా అనవసర రాద్దాంతం చేసిందని హిల్లరీ విమర్శించారు. దీనిపై ఎఫ్‌.బి.ఐ విచారణ సైతం ఓటమికి కారణమని హిల్లరీ చెప్పారు.

అయితే హిల్లరీ ఆరోపణలను అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తోసిపుచ్చారు. మోసకారి అయిన హిల్లరీ తన ఓటమికి ప్రతిఒక్కరిని నిందిస్తున్నారని ఫైరయ్యారు. తాను భయంకరమైన అభ్యర్థినని మాత్రం చెప్పడం లేదని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. తన ప్రచార బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని కల్పించి డొమొక్రాటిక్‌ పార్టీ ఓటమికి సాకులు చెబుతోందని మండిపడ్డారు. డొమొక్రాటిక్‌ పార్టీ చెప్పిన సాకు చూసి రష్యా కచ్చితంగా నవ్వుకుని ఉండొచ్చని ట్రంప్ చ‌మ‌త్క‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Hillary Clinton 
  • 2016 loss 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS