• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ మూడు రోజులూ డేంజర్.....

ఈ మూడు రోజులూ డేంజర్.. డేంజరేనంట

By - Tupaki Desk
Update: 2016-04-14 05:29 GMT
ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే బండలు పగిలేలా భానుడి చెలరేగిపోతున్నాడు. నిప్పులు చెరుగుతున్న సూరీడితో దశాబ్దాల రికార్డులు బద్ధలైపోతున్నాయి. తాజాగా పెరిగిన ఎండ తీవ్రత జనాల్ని బెంబేలెత్తేలా చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ.. రాయలసీమలో ఎండల తీవ్రతకు జనాలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటల తర్వాత బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. బుధవారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు 43 ఏళ్ల రికార్డుల్ని బద్ధలు చేయటం చూసినప్పుడు ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవతుంది. అంతేకాదు.. రానున్న మూడు రోజులూ జాగ్రత్తగా ఉండాలని.. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న హెచ్చరికల్ని వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం  నల్గొండలో గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలుగా నమోదు అయితే.. హైదరాబాద్ లో దశాబ్దాల రికార్డులు చెరిపేస్తూ.. ఏప్రిల్ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత 43గా నమోదైంది. ఎండ తీవ్రతకు జనాలు విలవిలాడిపోతున్నారు. సెగలు కక్కుతున్న ఎండ తీవ్రతకు.. ఉక్కపోత చంపేస్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ చరిత్రలో ఏప్రిల్ రెండో వారంలో ఇంత గరిష్ఠంగా ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం.

మరింతగా భయపెట్టే మరో నిజం ఏమిటంటే.. మే లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం ఖాయమని చెబుతున్నారు. గడిచిన 125 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణనిపుణులు అంచనాలు వేస్తున్నారు. 45 డిగ్రీల కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పాటు.. రాయలసీమలోని ప్రాంతాలన్నింటిలోనూ ఇదే స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావటం గమనార్హం.

శేషాచల అడవులు చుట్టూ ఉండే తిరుపతి పట్టణంలో బుధవారం 43.5 (44గా చెప్పేయొచ్చు) డిగ్రీలు నమోదైంది. ఒక్క కోస్తాంధ్రా మినహా.. మిగిలిన తెలుగు ప్రాంతాలన్నింటిలోనూ మండుతున్న ఎండల కారణంగా.. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.  ఇక.. 43.. 44 డిగ్రీల ఎండలు నమోదయ్యే వేళ.. బయట తిరగకపోవటం చాలా ముఖ్యం.

అన్నింటికి మించి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో వీలైనంత తక్కువగా బయటకు వెళ్లే పనులు పెట్టుకోవటం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లినా.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. రానున్న మూడు రోజులు మండే ఎండలు పక్కా అని తేలిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
Tags:    
  • Summer Effect 
  • Andhra And Telangana People 
  • Telugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS