హీరో రాజాను ఆ సర్పంచ్ పొగిడేశారు

Update: 2016-07-28 07:12 GMT
సినీ నటులకు పొగడ్తలు కామనే. కానీ.. ఒక కొత్త అంశానికి సంబంధించి టాలీవుడ్ హీరో రాజాకు పొగడ్తలు లభించాయి. తాను ఎంత బాధ్యతగా ఉంటానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసిన రాజా తీరుపై ఆయన నివాసం ఉంటున్న ప్రాంతానికి చెందిన సర్పంచ్ విపరీతంగా పొగిడేస్తున్నారు. హీరో రాజా బండ్లగూడలోని సాయినగర్ కాలనీలో నివాసం ఉంటారు. ఆ పంచాయితీలో పెద్ద పెద్ద భవంతులు ఉన్నా.. ఆస్తిపన్నును మాత్రం చాలామంది సక్రమంగా చెల్లించరు.

ఇదిలా ఉంటే తాజాగా సినీ హీరోరాజా మాత్రం తనకు తానుగా పంచాయితీ ఆఫీసుకు వెళ్లి.. తన ఇంటి ఆస్తిపన్నును స్వయంగా చెల్లించారు. దీంతో.. ఆనందానికి గురైన బండ్లగూడ సర్పంచ్ హరికృష్ణ రాజాను పొగిడేశారు. రాజా మాదిరి అందరూ తమ ఆస్తిపన్నును చెల్లించాలని.. రాజాను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గడువు రోజు వరకూ ఆగకుండానే మధ్యలోనే ఆస్తిపన్ను చెల్లిస్తే మంచిదన్న సూచన చేశారు. ఏమైనా ఒక సినీ నటుడు తన రంగానికి సంబంధం లేని అంశంలో నలుగురికి ఆదర్శంగా నిలిచారన్న పొగడ్తను సాధించటం  మంచిదే.
Tags:    

Similar News