గ్యాస్ పొయ్యి వెలిగించి రూ.20లక్షల నోట్లను కాల్చేశాడు
ఉన్నదాంతో సంతోషపడక.. లేని దాని కోసం పడే ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ ఉరుకులాటలోనే అడ్డదిడ్డంగా నడిచేస్తుంటారు చాలామంది. అలాంటి అవినీతి భాగోతంలో చిక్కుకున్న తహిసిల్దార్ ఒకరు.. తమ ఇంటికి అవినీతి నిరోధక శాఖ అధికారులు వస్తున్న విషయాన్ని తెలుసుకొని ఊహించని రీతిలో వ్యవహరించారు. ఇంట్లో అక్రమంగా దాచిన రూ.20లక్షల నోట్లను స్టవ్ వెలిగించి.. తలబెట్టేసిన వైనం సంచలనంగా మారింది.
రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిరోహి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నుంచి స్థానిక రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ సింగ్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతన్ని ప్రశ్నించగా.. తన తప్పేమీ లేదని.. తహసీల్దార్ కల్పేశ్ చెప్పినట్లే తాను చేశానని.. ఆయన ఆదేశాలకు అనుగుణంగా డబ్బులు తీసుకున్నట్లు చెప్పాడు.
దీంతో.. ఆ అధికారిని వెంట పెట్టుకొని కల్పేశ్ ఇంటికి వెళ్లారు. అధికారులు తన ఇంటికి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నకల్పేశ్.. ఇంటి తలుపుల్ని.. కిటికీల్ని మూసేసి.. గ్యాస్ స్టవ్ వెలిగించాడు. వరుసగా నోట్ల కట్టల్ని కాల్చటం షురూ చేశాడు. దీనికి ఆయన భార్య సాయం చేశారు. అయితే.. ఈ విషయాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు.. నోట్ల కట్టల్ని కాల్చటాన్ని కిటికీల్లో నుంచి చూశారు. అలాంటి పని చేయొద్దని అధికారులు చెప్పినా వారు మాత్రం ఊరుకోలేదు. చివరకు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన అధికారులు.. కల్పేశ్ ను అరెస్టు చేశారు. అప్పటికే రూ.20లక్షల నోట్లు కాలిపోగా.. రూ.1.5లక్షలు మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.