• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  షోయబ్​ అక్తర్​ నీకు...

షోయబ్​ అక్తర్​ నీకు అంతసీన్​ లేదు.. వాస్తవంలో బతుకు..!

By - Tupaki Desk
Update: 2021-05-22 01:15 GMT
పాకిస్థాన్​ మాజీ క్రికెటర్లు.. షోయబ్​ అక్తర్​, మహ్మద్​ ఆసిఫ్​ తరఫున దాదాపు 13 ఏళ్లుగా ఓ ఘటన విషయంలో గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పదమూడేళ్ల క్రితం పాకిస్థాన్​ జట్టు.. టీ20 ప్రపంచకప్​ ఆడేందుకు దక్షిణాఫ్రికా వెళ్లింది. ఆ టైంలో డ్రెస్సింగ్​ రూంలో షోయబ్​ అక్తర్​ కు మహమ్మద్​ ఆసిఫ్​ కు మధ్య గొడవ చెలరేగింది. ఆసిఫ్​ మరో క్రికెటర్​తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు.. అదేటైంలో అక్కడికి వచ్చిన అక్తర్​ ‘మీరు నా గురించే మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు కదా’ అంటూ గొడవకు దిగాడు.

ఈ సందర్భంగా అక్తర్​ కు ఆసిఫ్​కు మధ్య గొడవ చెలరేగింది. అక్తర్​ బ్యాట్​ తీసుకొని ఆసిఫ్​ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనతో ప్రపంచంలోని క్రికెట్​ అభిమానులు, క్రికెటర్లు నివ్వెరపోయారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు ఈ ఘటనపై స్పందించి.. వెంటనే అక్తర్​ ను అక్కడినుంచి వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత ఆసిఫ్​ కు అక్తర్​ సారీ కూడా చెప్పాడు.. కానీ ఇన్నేళ్లుగా ఈ వివాదం ఇంకా సాగుతూనే ఉంది.

తాజాగా ఈ వివాదంపై ఆసిఫ్​ మాట్లాడుతూ..
‘ ఈ ఘటన ఎప్పుడో పదమూడేళ్ల క్రితం జరిగింది. అయినా అక్తర్​ దీన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. రీసెంట్​ గా కూడా ఈ విషయంపై మాట్లాడుతూ.. నా మీద నోరు పారేసుకున్నాడు. దీంతో నేను అతడికి ఫోన్​ చేశాను. అప్పుడెప్పుడో జరిగిన ఘటనను వదిలేయాలని కోరాను. నోరుమూసుకోమని కూడా చెప్పాను’ అంటూ ఆసిఫ్​ పేర్కొన్నాడు.

ఆసిఫ్​ ఇంకా ఏమన్నాడంటే.. ’ షోయబ్​ అక్తర్​ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటాడు. నిజానికి అతడికి అంత సీన్​ లేదు. అక్తర్​ ఓ సారి తాను పాకిస్థాన్​ టీంకు హెడ్​కోచ్​ అవుతానని .. మరోసారి పీసీబీ (పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు) చైర్మన్​ అవుతానని ఊహించుకుంటాడు. నిజానికి అతడికి అంత సీన్​ లేదు. అటువంటి పగటి కలలు కనకుండా.. కొత్తగా వస్తున్న క్రికెటర్లకు, బౌలర్లకు అతడు సలహాలు ఇవ్వడం బెటర్​’ అంటూ ఆసిఫ్​ సూచించాడు. ప్రస్తుతం ఆసిఫ్​ వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఈ ఘటనపై అక్తర్​ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
Tags:    
  • Md Haseef 
  • Shoaib Aktar 
  • Pakistan 
  • Telugu News 

Similar News

జనసేన అభ్యర్థులు వీరే...పోటీ ఆసక్తికరం

2026-11-15 20:51 GMT

మ‌ర‌ణ శిక్ష‌లు నిలిపేయాలా.. వ‌ద్దా అనేది మా ఇష్టం: భార‌త్‌

2026-11-15 20:50 GMT

చంద్ర‌బాబుకు బిగ్ టెస్ట్ పెట్టేసిన అనంత త‌మ్ముళ్లు..!

2026-11-15 20:49 GMT

యార్ల‌గ‌డ్డ‌కు లోకేష్ మ‌ద్ద‌తు.. గ‌న్న‌వ‌రంలో యూట‌ర్న్‌..!

2026-11-15 20:41 GMT

ఏక‌గ్రీవం అంటే ఇలానే త‌మ్ముళ్లూ.. !

2026-11-15 20:35 GMT

ఎన్నిక‌ల వేళ‌.. గిరిజ‌నుల‌కు 3 వేల కోట్ల ప్రాజెక్టులు!

2026-11-15 20:35 GMT

రాత్రి ప‌దైంది.. బాబు నిద్ర‌పోతారులే అనుకున్నారు.. కానీ ఏం జ‌రిగిందంటే!

2026-11-15 20:34 GMT

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

2026-11-15 20:30 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!

2026-11-15 20:29 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

Copyright @2026

Powered by Blink CMS