కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య దూరం పెరిగిందా..?

Update: 2021-02-21 10:54 GMT
రాజకీయాల్లో కుటుంబ సభ్యులు ఉండడం కామన్. అయితే వారు ఎంతవరకు కలిసి సాగుతారనేది మాత్రం వారి సఖ్యతను బట్టి ఆధారపడి ఉంటోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా ఏళ్ల నుంచి కలిసి కాంగ్రెస్ లో కలిసిమెలిసి సాగుతున్నారు. ఇద్దరు ఏదో ఒక పదవితో ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి రాను రాను దిగజారుతుండడంతో వీరు చెరోదారి పడుతున్నట్లు కనిపిస్తోంది.  తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం..

నల్గొండ జిల్లా నుంచి లెజెండ్ లీడర్స్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ పేరు చెప్పుకుంటారు. వీరిలో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాగా.. మరొకరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వీరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలక పదవిలో ఉన్నారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

తిరుపతిలో పర్యటించిన సందర్భంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తా కావచ్చు..? అనే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్ని రోజులుగా ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై అయనను మీడియా ప్రశ్నలు వేయగా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్ నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదు.

తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించుకుంటున్నాడు. అంతకుముందు ప్రతీ కార్యక్రమంలో సోదరుడితో కలిసివెళ్లిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీతో పాటు సోదరునికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వీరి మధ్య  దూరం పెరిగిందని చర్చించుకుంటున్నారు. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్టీలో ఉండాలా..? వద్దా..? అనే నిర్ణయానికి వస్తున్నారట. మరి వీరి మధ్య సయోధ్య కుదిరే సమయం ఎప్పుడొస్తుందో చూడాలి.
Tags:    

Similar News