• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ మాంఝీ ఇంటికి రోడ్డు...

ఈ మాంఝీ ఇంటికి రోడ్డు వేసుకున్నాడు

By - Tupaki Desk
Update: 2017-01-12 09:42 GMT
భార్య కోసం బీహార్‌లో కొండను పిండి చేసిన మాంఝీ ఉదంతం మీకు గుర్తుండే ఉంటుంది.  అలాంటిదే ఒక స్పూర్తిదాయ‌క‌మైన అదే స‌మ‌యంలో చెంపపెట్టు లాంటి సంఘ‌ట‌న ఇది. పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డుకాదని మరోసారి రుజువు చేశాడు తిరువనంతపురానికి చెందిన శశి. అంగవైకల్యంతో బాధపడుతున్నాను. ఇంటివరకు రోడ్డు వేయండి అని విజ్ఞప్తి చేసినా పట్టించుకొని వ్యవస్థపై నిరసన వ్యక్తం చేస్తూ మూడేండ్లు కష్టపడి స్వయంగా ఇంటివరకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. త‌ద్వారా త‌న‌ను చీత్కరించిన వారికి చెంప‌దెబ్బ కొట్టినం ప‌నిచేశాడు. నడువలేని నీకు రోడ్డు ఎందుకు అని అవమానించిన గ్రామపంచాయతీ అధికారులకు శశి గుణపాఠం చెప్పారు. అంతేకాకుండా పలువురికి స్ఫూర్తిగా కూడా నిలిచారు.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన శశి 18 ఏళ్ల‌ క్రితం కొబ్బరి చెట్టు మీద నుంచి పడటంతో శరీరంలోని ఎడమ భాగం చచ్చుబడింది. దాంతో చాలా రోజులు మంచానికే పరిమితమై తర్వాత కొద్దికొద్దిగా నడవడం ప్రారంభించారు. తన జీవనోపాధి కోసం చిన్న వ్యాపారం చేసుకొనేందుకు ఉపయోగపడే విధంగా ఓ రిక్షాను సహాయంగా అందించాలని, ఇంటి సమీపం వరకు రోడ్డును నిర్మించాలని గ్రామపంచాయతీ అధికారులను అభ్యర్థించారు. సరిగా నడులేనందున వాహనం ఇవ్వడం కుదరదని ముఖం మీదే చెప్పారు. రోడ్డు ఏర్పాటు గురించి ఆలోచిస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. దాంతో శరీరం సహకరించకపోయినా పలుగు - పార చేతబట్టి ప్రతీరోజు ఆరుగంటలపాటు ఎత్తైన గుట్టను తవ్వడం ప్రారంభించానని శ‌శి త‌న అనుభ‌వాన్ని వివ‌రించారు. దాదాపు మూడేళ్ల‌ శ్రమ ఫలితంగా 200 మీటర్ల పొడవైన రోడ్డును ఏర్పాటు చేయగలిగానని పేర్కొన్నారు. శశి పడిన కష్టాన్ని వివరిస్తూ ఆయన భార్య కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు తవ్వే క్రమంలో ఆయనకేమైనా అయితే వైద్య చికిత్సకు డబ్బులు ఎలా అనే భయం వెంటాడేదని ఆమె తెలిపారు. ఇప్పుడు తయారైన రోడ్డు గురించి అందరూ మాట్లాడుతున్నారని, మా ఆర్థిక పరిస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

ప్ర‌భుత్వం చీత్కారించినా త‌న స‌త్తాతో ప్రపంచానికి విజ‌యం పాఠాలు నేర్పి మ‌రో మాంఝీ అనిపించుకున్న శ‌శి ఉదంతం పోరాట ప‌టిమ‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    
  • Handicapped man 
  • Kerala 
  • Road 
  • Telugu NEWs 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS