• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తిరుపతి ఉప ఎన్నికల బరిలో...

తిరుపతి ఉప ఎన్నికల బరిలో గంటా?

By - Tupaki Desk
Update: 2021-03-14 06:30 GMT
ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే గంటా.. అందుకు భిన్నంగా కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. తాజాగా హాట్ టాపిక్ గా మారిన విశాఖ ఉక్కు సంస్థను ప్రవైటీకరణ చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ ను తన రాజీనామా పత్రాన్ని పంపారు.

టీడీపీలో కొనసాగుతున్న ఆయన.. అధికార వైసీపీలో చేరేందుకు పలు ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు. అందుకు ఓకే అని చెప్పినట్లే చెప్పి.. మళ్లీ వెనక్కి తగ్గటంతో.. సరైన హామీ లభించకపోవటంతో ఆయన వైసీపీలోకి చేరలేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. విశాఖ ఉక్కు సంస్థను నిలుపుకోవటంపై ఏపీలోని వారంతా తీవ్రంగా తపిస్తున్న వేళ.. తాను తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో గంటా ఉన్నట్లు చెబుతున్నారు.

విశాఖ ఉక్కు సంస్థను దక్కించుకోవటం కోసం తమ పదవుల్ని వదులుకోవాలని అధికార.. విపక్ష నేతలపై ఒత్తిడి ఉన్నా.. అందరూ ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ.. గంటా మాత్రం అందుకు భిన్నంగా తన పదవికి రాజీనామా చేసి మిగిలిన నేతలకు తనకు మధ్య తేడాను చేతల్లో చూపించారు. తిరుపతి ఉప పోరులో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీతో పాటు బీజేపీ సైతం పోటీకి దిగనుంది.

వాస్తవానికి విశాఖ ఉక్కు సంస్థపై కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా అఖిలపక్షం ఒక అభ్యర్థిని బరిలోకి దించితే బాగుంటుంది. అందుకు భిన్నంగా.. ప్రతిపార్టీ  బరిలోకి దిగనున్న నేపథ్యంలో.. తాను  కూడా దిగాలన్న యోచనలో గంటా ఉన్నట్లుచెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో తనకెంతో అనుబంధం ఉందని చెప్పే గంటా.. తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిస్తే విశాఖ ఉక్కు నినాదాన్ని జాతీయస్థాయిలో వినిపించే వీలుందన్నఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఉక్కు కోసం పదవుల్ని వదిలేసిన వారిలో మొదటి వ్యక్తిగా గంటా నిలుస్తున్నారు. తిరుపతి బరిలో నిలవటం ద్వారా తన సత్తానుచాటటంతో పాటు.. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలన్నది ఆయన ఆలోచన. మరి.. గంటా వ్యూహాన్ని అమలయ్యేలా పరిణామాలు ఉంటాయా? ఇంకేమైనా ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    
  • ganta srinivas rao 
  • Tirupati by elections 
  • vizag 
  • andhra pradesh 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS