మహిళపై గ్యాంగ్ రేప్.. ఆమెను వదిలేసిన భర్త.. తూ.గో. జిల్లాలో దారుణం..!
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత మందికి శిక్షలు పడుతున్నా.. మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. యథేచ్ఛగా వారిపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా.. ఇద్దరు దుండగులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాకలో జరిగింది.
కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు వ్యక్తులు ఓ వివాహితపై అత్యాచారానికి తెగబడ్డారు. ఒంటరిగా ఉన్న ఆమెను.. బలవంతంగా ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే.. ఈ దారుణంతోనే కుమిలిపోతున్న ఆమెకు పిడుగులాంటి వార్త చెప్పాడు భర్త. ‘నువ్వు చెడిపోయావు’ అంటూ.. ఆమెకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
జరిగిన ఘటనతో కుమిలిపోతున్న ఆమెకు అండగా నిలవాల్సిన భర్త.. తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమవడంతో గుండెలవిసేలా రోదించింది బాధితురాలు. ఇక, తాను ఎవరికోసం బతకాలని, ఎందుకోసం బతకాలని, చావే తనకు శరణ్యం అంటూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోబోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.