అమెరికాలో భారతీయ మహిళల బంగారం లూటీ

Update: 2018-05-24 11:37 GMT
విలాసాలకు అలవాటు పడ్డ యువతకు ఇప్పుడు చైన్ స్నాచింగ్ అనేది వృత్తిగా మారిపోయింది. రోడ్డు వెంబడి నడుచుకుంటే వెళ్లే మహిళలను టార్గెట్ చేసి ఇప్పుడు దొంగతనాలు ఎక్కువై పోయాయి. ప్రతి మహిళ మెడలో కనీసం రెండున్నర తులాల బంగారం ఉండడంతో ఎంతలేదన్నా 50వేలకు పైగా సొమ్ము గ్యారెంటీ.. ఇదే చెడు అలవాట్లకు బానిసైన యువతకు అవకాశంగా  మారింది.

ఈ చైన్ స్నాచింగ్ లతో బయటకు వెళ్లాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది.  అయితే తాజాగా బయటి దేశాల్లో కూడా మన వాళ్లు చైన్ స్నాచర్ల బారిన పడుతున్నారన్నది తాజా న్యూస్..

అమెరికాలోని కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ లో, అది ఇండియన్స్ ఎక్కువగా ఉండే శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా లో  అక్కడి పోలీసులకు చైన్ స్నాచింగ్ దొంగల బెడద ఎక్కువైంది. కేవలం వారం రోజుల్లోనే ఆరు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. బెంగళూరు - చెన్నై - హైదరాబాద్ లాంటి ఇండియన్ సిటీస్ కు చెందిన ప్రవాస మహిళలు బాధితులుగా మారిపోతున్నారు. ఇండియన్ ఆడవాళ్లనే టార్గెట్ చేసి దొంగలు దోచుకెళ్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు అమెరికాలో మహిళలు బంగారం వేసుకొని బయటకు రావడానికే భయపడిపోతున్నారట..

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News