కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా

Update: 2018-06-22 10:09 GMT
 గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పదవి కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. ఈ పదవి ఆశించిన సీనియర్ నేత - మాజీ మంత్రి దానం నాగేందర్ అది  దక్కకపోవడంతో కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఆయన షాకిచ్చారు. ఇటీవలే గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి మాజీ ఎంపీ అంజన్ కు కట్టబెట్టడంపై లోలోపల రగిలిపోతున్న దానం అన్నంత పని చేశాడు.

కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి - పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి దానం పంపించారు.

తదుపరి కార్యాచరణ నిమిత్తం రేపు తన అనుచరులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లేది లేనిది వెల్లడిస్తానని దానం తెలిపారు. దానం గ్రేటర్ పదవి ఆశించి దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా కనిపించినా నామమాత్రంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా రాజీనామా చేయడం కాంగ్రెస్ ను కలవరపాటుకు గురిచేసింది.
Tags:    

Similar News