• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాపుల‌కు సీఎం పీఠం కోసం...

కాపుల‌కు సీఎం పీఠం కోసం పెద్దాయన ఆపసోపాలు....?

By - Tupaki Desk
Update: 2021-09-17 03:30 GMT
ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. 1970 టైమ్ లోనే ఎమ్మెల్యేగా గెలిచిన నేత. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య. ఆయనకు కాపు నాయకుడు అనిపించుకోవడం ఇష్టం. రాజకీయాల్లో కాపులు ఎంత ప్రభావిత వర్గంగా ఉన్నా కూడా అన్ని కులాలు కలిస్తేనే గెలుపు సాధ్యపడుతుంది. ఇది రాజకీయం చెప్పిన సత్యం. ఇదిలా ఉంటే హరిరామ జోగయ్య చాలా పార్టీలు మారారు. కాంగ్రెస్ నుంచి టీడీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్, అలాగే ప్రజారాజ్యం, వైసీపీ ఇలా చాలా తిరిగేశారు. ఇక ఇపుడు జనసేన వైపు ఆయన మొగ్గు చూపిస్తున్నారు. ఈ మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా పనిచేశారు. కాపులకు ముఖ్యమంత్రిత్వం దక్కాలన్నది హరిరామ జోగయ్య ఆరాటం.

దాని కోసం ఆయన వయసులో ఉన్నపుడు ఏం చేశారో తెలియదు కానీ ప్రజారాజ్యం, జనసేనల వెనకాల ఉన్నది మాత్రం అదే ఆశయంతో..? అయితే రాజకీయాల్లో ఏది చేసినా కూడా తెర చాటునే ఉండాలి. తెర ముందుకు వచ్చి బోరవిడుచుకోకూడదు. అలా కనుక చేస్తే మాత్రం బూమరాంగ్ అవుతుంది. కమ్మ వారికి కూడా ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది. అయితే ఎన్టీఆర్ టీడీపీ పెట్టి అన్ని వర్గాల ఆమోదంతో ఆ పదవిని దక్కించుకున్నారు. కాపుల విషయంలో మాత్రం వారికి ఆ ఛాన్స్ రాలేదు.

జ‌నాభా ప‌రంగా నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఉన్న వారికి ముఖ్యమంత్రి పదవి దక్కాల్సిందే. అలాగని ప్రజాస్వామ్య పద్ధతులలో ఎన్నికల రాజకీయాలను దాటుకుని ముందుకు సాగలేరు కదా. ఇక జోగయ్య లాంటి వారు అన్ని పార్టీలలో తిరిగి పదవులు సంపాదించుకున్నారు. తాముగా నాయ‌కులు అయ్యారు. కానీ కులాన్ని ఎంతవరకూ సంఘటితం చేశారన్నది గుండెల మీద చేయి వేసుకుని తామే ప్రశ్నించుకోవాల్సిన మాట. ఇక మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లాంటి వారు కాపుల కోసం అన్నీ త్యాగాలు చేసి చిత్తశుద్ధితో చేస్తే కాపులు తలో పార్టీని ఎంచుకుని తమ రాజకీయం చూసుకున్నారు.

ఇపుడు హరిరామ జోగయ్య లాంటి వారు ఈ వయసులో కాపుల విషయంలో మాట్లాడినా వారికి పెద్దగా చేరుతుందా అన్నదే చూడాలి మరో వైపు అన్ని కులాలు తనకు సమానమే అంటూ వస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుడికి కుల మకిలి అంటించి మరింతగా అవకాశాలు దెబ్బతీసే విధంగానే కాపునాడు నేతల కార్యకలాపాలు సాగితే మాత్రం అందరికీ చేటు తెచ్చినట్లే.


Tags:    
  • Former Minister 
  • Chegondi Hariram Jogaiah 
  • political News 
  • Politicians 
  • Political Updates 
  • Latest Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS