చెల్లిని చంపేసిన పదిహేనేళ్ల బాలిక.. కారణం తెలిస్తే నోట మాట రాదంతే
కాలం గడిచే కొద్దీ ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే దారుణాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటిని చదువుతున్నప్పుడు బంధాలు.. అనుబంధాల మీద కొత్త అనుమానాలు రావటమే కాదు.. ఇంత దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? చిన్న పిల్లల్లోనూ తన రక్తం పంచుకు పుట్టిన వారిని చంపేయాలన్న పైశాచికం ఎందుకు పెరుగుతుందన్న సందేహం రాక మానదు.
యేపీలో చోటు చేసుకున్న ఒక హత్య ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. విన్న వారంతా నోట మాట రాని విధంగా షాక్ కు గురవుతున్నారు. మీర్జాపూర్ లోని 15 ఏళ్ల బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న రిలేషన్ కు అడ్డుగా ఉందని పదకొండేళ్ల తన చెల్లెల్ని హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. సైకిల్ రిపేర్ కోసమని అబద్ధం చెప్పి అక్కా చెల్లెళ్లు ఇంటి నుంచి బయటకు వచ్చారు. అనంతరం బాయ్ ఫ్రెండ్ తో కలిసి పెద్దమ్మాయి బైకు మీద మీర్జాపూర్ కు వెల్లింది. కాస్తంత షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి బయలుదేరారు.
ఈ ప్రయాణంలో అలిసిన చిన్నారి చెల్లెలు నిద్రలో ఉండగా.. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆమె గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ధౌరా రైల్ క్రాసింగ్ సమపంలో చెల్లెలు డెడ్ బాడీని పారేసి పారిపోయారు. ఉదయం బయటకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు రాత్రి అయ్యేసరికి తిరిగి రాకపోవటంతో వారి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ అయినట్లుగా తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్క ఆచూకీని గుర్తించారు. ఈ సందర్భంగా చెల్లి కోసం తమదైనశైలిలో విచారణ చేయగా.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన చెల్లెల్ని చంపుకున్నట్లుగా పేర్కొంది. తన తల్లిదండ్రులు తనకు మించి తన చెల్లెలు అంటే ప్రేమను చూపించేవారని.. అందుకే చంపేసినట్లు ఒప్పుకుంది. అంతేకాదు.. తన భాయ్ ఫ్రెండ్ తో ఉన్న రిలేషన్ కు అడ్డుగా నిలుస్తున్నట్లుగా భావించి ఈ దారుణానికి పాల్పడినట్లుగా వెల్లడించింది. ఆమె మాటల్ని విన్న పోలీసులు సైతం షాక్ కు గురవుతున్నారు. నిండా పదిహేనేళ్లు ఉండే బాలిక.. తన చెల్లెల్ని చంపేసిన తీరు ఉలిక్కిపడేలా చేస్తుందని చెప్పక తప్పదు.