రిలయన్స్ జియోలో 9.99 శాతం వాటా కొన్న ఫేస్‌ బుక్‌ !

Update: 2020-04-22 04:30 GMT
రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెట్టింది. రూ.43,574 కోట్ల రూపాయలు విలువ చేసే  9.99 శాతం వాటాను సోషల్  మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్  కొనుగోలు చేసింది.  రూ.4.62 లక్షల కోట్ల విలువ ఉన్న జియోలో వాటా కొనుగోలు వల్ల జియోలో అతిపెద్ద మైనారిటీ షేర్ హోల్డర్‌ గా ఫేస్‌ బుక్ నిలిచింది. ఈ సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.. ఇండియా డిజిటల్ సర్వోదయ లక్ష్యంతో 2016లో జియోను ప్రారంభించాం. దేశంలోని ప్రతీ ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్‌ ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా జియోను తీసుకొచ్చాం. ఇప్పుడు జియోలోకి ఫేస్‌‌బుక్‌ను ఆహ్వానిస్తున్నాం. ఇది గౌరవప్రదమైనది.  దీని ద్వారా  ప్రతి భారతీయుడు డిజిటల్ రంగంలో మరింత లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం అని తెలిపారు.

జియో, ఫేస్‌బుక్ సమాహారం డిజిటల్ ఇండియాకు ఉపయోగపడుతుందని ముఖేశ్ అంబానీ తెలిపారు. ఎలాంటి హద్దులు లేకుండా ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్ లక్ష్యాలను చేరుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. కరోనా తర్వాత.. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, దానికి జియో, ఫేస్‌ బుక్ బంధం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం భారతదేశానికి ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోందని ఫేస్‌ బుక్‌ ప్రత్యేక ప్రకటనలో తెలిపింది. 328 మిలియన్ల నెలవారీ వినియోగదారులతో ఫేస్‌ బుక్‌ కు భారతదేశం అతిపెద్ద మార్కెట్ మరియు సంస్థ యొక్క వాట్సాప్ మెసేజింగ్ అనువర్తనం దేశంలో 400 మిలియన్ల వినియోగ దారులను కలిగి ఉంది, ఇది ప్రపంచంలోనే ఎక్కువ.

భారత్‌ డిజిటల్ దిశగా వేగంగా ప్రయాణం సాగిస్తోంది. చిన్న వ్యాపారాలు ఆన్‌ లైన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ మార్పులో జియో పాత్ర అత్యంత కీలకం. అదీకాక.. భారత్‌ లో 6 కోట్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. లక్షలాది మంది వాటిపై ఆధారా పడి బతుకుతున్నారు. లాక్‌ డౌన్ లాంటి సమయాల్లో చాలా మంది డిజిటల్ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. వారికి జియో సహాయం చేస్తోంది. ఫేస్‌ బుక్‌ తో జత కట్టినందుకు ముఖేశ్ అంబానీకి కృతజ్ఞతలు. జియో టీమ్‌కు కూడా అని జూకర్‌బర్గ్ పోస్ట్ చేశారు. జియోతో కలిసి పనిచేయడానికి మేం ఎదురుచూస్తున్నాం అని తెలిపారు.


Tags:    

Similar News