తెలంగాణలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోల మృతి
మావోలకు తెలంగాణ రాష్ట్రం స్లీపర్ సెల్ గా ఉంటుందన్న మాట కొద్ది కాలంగా వినిపిస్తున్నదే. ఈ మధ్యనే మావో అగ్రనేతలు పలువురు ప్రభుత్వానికి లొంగిపోతారంటూ మీడియాలో వార్తలు వస్తున్న వేళ.. అందుకు భిన్నమైన పరిణామం చోటు చేసుకుంది. గడిచిన వారం రోజులుగా విడవకుండా పడుతున్న వర్షపు వేళ.. పచ్చని అడవుల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించారు.
శనివారం రాత్రి తొమ్మిది గంటల వేళలో కుమురంభీం- ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కదంబా అటవీ ప్రాంతంలో పోలీసులకు - మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఉదంతంలో ఇద్దరు మావోలు మరణించగా.. టాప్ క్యాడర్ కు చెందిన అడెల్లు అలియాస్ భాస్కర్ త్రుటిలో తప్పించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఓవైపు భారీ వర్షం.. మరోవైపు సాగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో మరణించిన మావోల్ని గుర్తించటంలో ఆలస్యమవుతుందని చెబుతున్నారు. దట్టమైన అడవిలో.. పులులు ఉంటాయని చెప్పే ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరగటం గమనార్హం. చనిపోయిన ఇద్దరు మావోల్లో ఒకరు మహిళా మావోగా తెలుస్తోంది. అధికారికంగా దీనికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది.
ఈ ఎన్ కౌంటర్ వేళ.. మావో అగ్రనేతల్లో ఒకరు.. పాతికేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న భాస్కర్ మరోసారి ఎన్ కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అతని తలపై రూ.20లక్షల రివార్డు ఉంది. మావోల కదలికల్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని పక్కా సమాచారంతో దాడి చేసినట్లుగా చెబుతున్నారు. పక్కా సమాచారంతోనే గడిచిన రెండు రోజులుగా ఆసిఫాబాద్.. కాగజ్ నగర్ సమీప అటవీ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
మావోల సంచారం పై పక్కా సమాచారం అందటంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల రెండు నుంచి ఐదు రోజుల పాటు ఆసిఫాబాద్ లో మకాం వేసి మరీ.. తాజా ఆపరేషన్ కు స్కెచ్ వేసినట్లుగా సమాచారం. తమకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పోలీసులకు అందుతున్న నేపథ్యంలో దండకారణ్యంలోకి తిరిగి వెళ్లే క్రమంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది.