వాటికి నోటరీ సంతకాలు అక్కర్లేదు

Update: 2015-07-03 04:50 GMT
విద్య.. ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా అప్లికేషన్‌ పెట్టుకుంటే అలాంటి వారు.. తమ విద్యా సంబంధమైన పత్రాలకు ధ్రువీకరణ కోసం గెజిటెడ్‌.. నోటరీ సంతకాలు పెట్టటం దశాబ్దాలుగా సాగుతున్న వ్యవహారం.

దీని కారణంగా కోట్లాది మంది విద్యార్థులు.. ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఇలాంటి వారు గెజిటెడ్‌.. నోటరీ సంతకాల కోసం చాలా అవస్థలు పడుతుంటారు. ఉన్న ఊరిలో అయితే ఫర్లేదు.. ఏదైనా ఊరు కాని ఊరు వెళితే ఇందుకోసం చాలానే తిప్పలు పడాల్సి వచ్చేది.

ఈ ఇబ్బందిని గురించిన కేంద్రం తాజాగా ఒక అధికారిక నిర్ణయాన్ని తీసుకుంది. గెజిటెడ్‌.. నోటరీ సంతకాలు అవసరం లేదని.. దీని స్థానే సదరు అభ్యర్థి స్వీయ సంతకం చేస్తే సరిపోతుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. స్వీయ ధ్రువీకరణకు సంబంధించి పలు రాష్ట్రాల్లో మంచి స్పందన లభించిందని..ఈ విషయంలో ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఆయన సూచిస్తున్నారు.

Tags:    

Similar News