• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్...

ట్రంప్ భ‌య‌ప‌డ్డారా...భ‌య‌పెట్టారా?

By - Tupaki Desk
Update: 2017-05-13 04:47 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ త‌న నిర్ణ‌యం కార‌ణంగా మరో వివాదంలో చిక్కుకుపోయారు. ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ పదవి నుంచి జేమ్స్‌ కోమేను ట్రంప్‌ తొలగించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ ఎన్నికల ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయిందా? అన్న విషయంపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో తనపై విచారణ చేయరాదు...అంటూ ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ పై ఒత్తిడి తీసుకొచ్చారని, బెదిరించారని అమెరికా మీడియా రాసిన పలు కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎఫ్‌బీఐ దర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలో ట్రంప్‌ కీలకమైన నిర్ణయం తీసుకోవటం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని డెమొక్రటిక్‌ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది.

అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన బాగోతం గురించి విశ్లేషించ‌డం ద్వారా జేమ్స్‌ కోమే తన కొంపముంచుతాడని బెదిరిపోయిన ట్రంప్ ఎఫ్‌ బీఐ డైరెక్ట‌ర్‌ ను పదవి నుంచి తొలగించారని డెమొక్రట్లు ఆరోపిస్తున్నారు. మన మధ్య జరిగిన సంభాషణల టేపులు బయటకు వచ్చాయో... నీ సంగతి చూస్తానంటూ జేమ్స్‌ కోమేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారని కూడా డెమెక్రాట్లు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఒక విందు కార్యక్రమంలో, మరోసారి ఫోన్‌ సంభాషణల్లో జేమ్స్‌ కోమేతో తాను మాట్లాడానని, ఇందుకు సంబంధించి సంభాషణలు మీడియాకు లీక్‌ చేస్తే బాగోదంటూ తాజాగా ట్విట్టర్‌ లో ట్రంప్‌ హెచ్చరించారు.

ఈ ఏడాది మార్చి 20న సెనెట్‌ హౌస్‌ ఇంటెలిజన్స్‌ కమిటీ ముందు హాజరైన కోమీ, ''రష్యా జోక్యంపైనేగాక, ట్రంప్‌ ప్రచార బృందం రష్యాతో కుమ్మక్కయిందా? అనే విషయంపై కూడా ఎఫ్‌ బీఐ దర్యాప్తు జరుపుతోంది''అని చెప్పారు. అటు తర్వాత కోమీ వివిధ సందర్భాల్లో చెప్పిన మాటలు ట్రంప్‌ ను ఆందోళనకు గురిచేశాయి. దీంతో సందర్భం చూసి దెబ్బకొట్టాలని ట్రంప్‌ ప్రణాళిక వేశారు. తనపై దర్యాప్తు చేయటం లేదని కోమీతోనే బలవంతంగా చెప్పించారు. కొద్ది రోజులాగి ఆయనకు ఉద్వాసన పలుకుతున్నామన్న వార్తను వెలువరించారు. మొన్నటిదాకా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా జేమ్స్‌ కోమీ రోజూవారీగా నివేదికలు అందుకుంటున్నారు. అంతకు ముందు వీక్లీ రిపోర్టులు ఆయనకు వచ్చేవి. ఈ పరిస్థితులు ట్రంప్‌ ను ఆందోళనకు గురిచేశాయి. విచారణ పూర్తయితే ఎదురయ్యే పరిణామలు ఆయన్ని భయపెట్టి ఉంటాయని, వీలైనంత వేగంగా దర్యాప్తును నీరుగార్చాలని బలంగా నిర్ణయించుకున్నారని అమెరికా మీడియా పలు కథనాలు రాసింది. ఈ క‌థ‌నాల‌ను స‌హ‌జంగానే ట్రంప్ ఖండించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Donald Trump 
  • FBI director 
  • James Comey 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS