• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ సూచన - కరోనా నుండి...

ట్రంప్ సూచన - కరోనా నుండి బయటపడ్డ ఫ్లోరిడా వ్యక్తి

By - Tupaki Desk
Update: 2020-03-24 03:35 GMT
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని బలితీసుకుంది. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు దీనికి మందు లేదు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. కరోనాకు విరుగుడు కనుగొనే వ్యాక్సిన్ ప్రక్రియ సత్ఫలితాలు ఇచ్చే దశకు చేరుకుందని - హైడ్రాక్సీక్లోరోక్వినైన్ - అజిత్రోమైసిన్ కలయికతో దీనిని రూపొందిస్తున్నవ్యాక్సిన్ కరోనాను నివారించే అవకాశముందన్నారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్ బాగా పని చేస్తుందని వైద్యులు కూడా చెప్పారన్నారు.

దీనికి కొనసాగింపుగా తాజాగా మరో ట్వీట్ చేశారు. ఫ్లోరిడాలో ఓ వ్యక్తి తాను సూచించిన డ్రగ్‌ ను ఉపయోగించి బయటపడ్డారని ట్రంప్ పేర్కొంటూ ఈ ట్వీట్ చేశారు. న్యూయార్క్ - ఇతర చోట్ల దీనిని (మెడిసిన్) ప్రారంభించడానికి ముందే శుభవార్త అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తకు సంబంధించిన లింక్ పోస్ట్ చేశారు. ఈ వార్త ప్రకారం.. ఫ్లోరిడాలో 52 ఏళ్ల ఓ వ్యక్తి ట్రంప్ సూచించిన డ్రగ్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మేరకు అతను చెప్పినట్లుగా కథనంలో ఉంది.

అతని పేరు రియో గియార్డినియెరి. అతను బ్యాక్ పెయిన్ - తలనొప్పి - దగ్గు వంటి వాటితో ఆసుపత్రిలో చేరాడు. అతనికి కోవిడ్-19 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సౌత్ ఫ్లోరిడాలోని మెమోరియల్ రీజినల్ హాస్పిటల్ వైద్యులు అతనికి చికిత్స చేశారు. కొద్ది వారాల తర్వాత వారు చేతులెత్తేశారు. ఆ సమయంలో తాను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేనని, తాను ఇక మరణించినట్లేనని భావించానని రియో గియార్డినియెరి అన్నారు.

అదే సమయంలో ట్రంప్ సూచించిన మెడిసిన్ గురించి తన స్నేహితుడు ఒకరు ఆర్టికల్ చదివి - దానిని తనకు పంపించారని చెప్పాడు. ఈ మెడిసిన్ దశాబ్దాలుగా యాంటీ మలేరియాకు వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే తాను ఈ మెడిసిన్ తీసుకొని ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు.

కాగా, వైద్య చరిత్రలో అతిపెద్ద గేమ్ ఛేంజర్స్‌ అవతరణకు అవకాశముందని - హైడ్రాక్సీక్లోరోక్వినైన్ - అజిత్రోమైసిన్ ఈ రెండింటి కలయికతో రూపొందే సరికొత్త ఔషధం సత్ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై పరిశోధన కొనసాగిస్తోందని - అజిత్రోమైసిన్ కంటే హైడ్రాక్సీక్లోరోక్వినైన్ మంచి ఫలితాలనిస్తోందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంటీ మైక్రోబయాల్ ఏజెంట్స్ కూడా చెప్పారన్నారు. పరిశోధకులు ఈ రెండింటినీ వెంటనే వినియోగంలోకి తీసుకొస్తారనే విశ్వాసముందన్నారు.

మలేరియా నివారణకు ఉపయోగించే క్లోరో క్విన్ కరోనా వైరస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందని కొంతమంది వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. దీనికి హెల్త్ అఫీషియల్స్ అప్రూవల్ అవసరం.


Tags:    
  • Donald Trump 
  • CoronaVirus Medicine 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS