• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ అధ్యక్షుడయ్యాక...

ట్రంప్ అధ్యక్షుడయ్యాక తొలి పరీక్ష..

By - Tupaki Desk
Update: 2018-11-05 12:16 GMT
అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు వేళయ్యింది. అమెరికా సెనెట్ లో మొత్తం 435 స్థానాలున్నాయి. ఇందులోని 100 సెనెట్ స్థానాల్లో 35 సెనెట్ స్థానాలకు ఈ నెల 6న మంగళవారం  ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యాక మధ్యలో వచ్చిన ఈ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రతినిధుల సభ - సెనేట్ తోపాటు 39 రాష్ట్రాలు - ప్రాదేశిక మండళ్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాన పార్టీలైన డెమోక్రాట్లు - రిపబ్లికన్లు ఇందులో మెజార్టీ సీట్లు సాధించి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.

అమెరికా అధ్యక్షుడికి ఈ ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఆయన 22 నెలల పాలనకు తీర్పుగా డెమొక్రాట్లు భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ కు ఎక్కువ సీట్లు వస్తే మాత్రం అమెరికాలో మరిన్ని వివాదాస్పద నిర్ణయాలు - ఆధిపత్య చర్యలకు మార్గం సుగమం అవుతుందని ప్రతిపక్ష డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ దూకుడుకు ముకుతాడు వేసేలా ప్రజలు తీర్పునిస్తారని డెమోక్రాట్లు భావిస్తున్నారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీలకు 1934 నుంచి కలిసిరాలేదు. ఈ ఎన్నికల్లో కేవలం మూడు సార్లు మాత్రమే అధ్యక్ష పార్టీ గెలవడం విశేషం.

కాగా ఈ ఎన్నికలపై జరిగిన తాజా సర్వేలో ట్రంప్ కు ఓటేసిన 51శాతం మంది ఇప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నట్టు తేలింది. ఇది డెమొక్రాట్లకు కొండంత బలంగా మారింది. కాగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్టే ఈ ఎన్నికల్లోనూ రష్యా - చైనాలు వేలుపెడుతున్నాయని తాజాగా అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం విశేషం.

మధ్యంతర ఎన్నికలకు పోలింగ్ మంగళవారం జరగబోతోంది. ఈ ముందస్తు ఎన్నికల్లో గతంలో కంటే చాలా ఎక్కువ పోలింగ్ నమోదు కానుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 3.15 కోట్ల మంది ఇప్పటికే ముందస్తు ఓటింగ్ వేశారని తెలిపారు.
    

Tags:    
  • Donald Trump 
  • US midterm Polls 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS