• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వీసా ర‌చ్చ‌..ట్రంప్...

వీసా ర‌చ్చ‌..ట్రంప్ చెప్పిన గుడ్ న్యూస్‌

By - Tupaki Desk
Update: 2018-10-01 13:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాల విష‌యంలో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌దాని వెంట మ‌రొక‌టిఅన్న‌ట్లుగా ఆయ‌న ఇస్తున్న ఆదేశాల ఫ‌లితంగా షాక్‌కు గుర‌వుతున్న వారికి తాజాగా ఓ తీపిక‌బురు అందింది. పెట్టుబడి ఆధారంగా జారీ చేసే వీసాల విష‌యంలో ఆయ‌న తీపిక‌బురు వినిపించారు. ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే భారతీయులకు శుభవార్త చెప్తూ...ప్రస్తుతం ఉన్న ఈబీ-5 వీసా పెట్టుబడి పథకాన్ని డిసెంబర్ 7 వరకు అమెరికా ప్రభుత్వం వాయిదా వేసింది. త్వరలో ఈబీ-5 వీసా పెట్టుబడి భారీగా పెరుగుతుండటంతో భారతీయులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్న నేప‌థ్యంలో ఈ తీపిక‌బురు సంతోషంగా మారింది.

ఈబీ-5 ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 లక్షల డాలర్లు (రూ.7.2 కోట్లు)-  ప్రత్యేక ప్రాంతాల్లో అయితే 5 లక్షల డాలర్లు (3.6 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. ఏల్ల‌ తరబడి ఇదే మొత్తం పెట్టుబడి కొనసాగుతుండటంతో ఈ మొత్తాన్ని పెంచాలని ఒబామా హయాంలో ఓ బిల్లును తీసుకొచ్చారు. దాని ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని 18 లక్షల డాలర్లు (రూ.12.96 కోట్లు) ప్రత్యేక ప్రాంతాల్లో 13.5 లక్షల డాలర్ల (రూ.9.72 కోట్లు)కు పెంచాలని ప్రతిపాదించారు. కాగా ఈ పెంపు ప్రతిపాదనను డిసెంబర్ 7 వరకు వాయిదా వేశారు. దీంతో పాత పెట్టుబడితోనే ఈబీ-5 వీసాను పొందే అవకాశం భారతీయులకు ఏర్పడింది.  కాగా, 2016లో 50 మంది పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోగా - ఆ తర్వాతి ఏడాదిలో 97 వచ్చాయని - ప్రస్తుత సంవత్సరంలో 200 వచ్చే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ అమెరికా ఈబీ-5 వీసా జారీ అయిన వ్యక్తి ఐదేళ్ల‌ పాటు అక్కడే నివసిస్తే గ్రీన్‌ కార్డు కూడా లభించనున్నదని - గృహాన్ని కూడా కొనుగోలు చేసుకునే వీలుంటుంది.

ఈ వీసాల జారీ ద్వారా అమెరికాకు వచ్చేవారిలో భారత్ మూడో స్థానంలో ఉన్నదని - తొలి స్థానంలో వియత్నాం - ఆ తర్వాతి చైనా ఉంది. ఈ వీసా కింద పెట్టుబడిదారుడితోపాటు ఆయన భార్య - 21 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పెళ్లి కాని యువతీ యువకులను తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ వీసాల కింద ఉన్న మార్గదర్శకాలను మార్చే అవకాశం ఉన్నదని - సెప్టెంబర్ 30 నుంచి కొత్త నిబంధనల ప్రకారం పెట్టుబడుల పరిధిని మరింత పెంచే అవకాశం ఉందన్నారు.
Tags:    
  • Donald Trump 
  • India 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS